APSWREIS Secretary (imagecredit:swetcha)
తెలంగాణ

APSWREIS Secretary: ప్రధానమంత్రి అవార్డును అందుకున్న కలెక్టర్.. ఎవరంటే!

APSWREIS Secretary: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి అవార్డు (2023)ను APSWREIS సెక్రటరీ వి.ప్రసన్న వెంకటేష్ నేడు డిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అందుకున్నారు. 17వ సివిల్ సర్వీస్ డే సంధర్బంగా డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో వికసిత్ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేద్ర మొదీ హాజరయ్యారు. ఈ సంధర్బంగా పరిపాలనలో ఉత్తమ పనితీరు కనబరిచిన పలువురు ఐఏయస్ అధికారులకు ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది.

ప్రసన్న వెంకటేష్ జనవరి 2022 నుంచి జూలై 2024 వరకు ఆంద్రప్రదేశ్ ఏలూరు జిల్లాకు తొలి కలెకర్ట్ గా పనిచేసిన సమయంలో ఆయన ప్రజలకు అందించిన సేవలకు గాను ప్రభుత్వం ఈ అవార్డు అందుకున్నారు. ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ పథకాలను విస్సతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలులో భాగంగా మహిళలు, బాలికల్లో రక్తహీనత నివారణకు ఎంతో కృషి చేశారు.

Alaso Read: Hyderabad-2 Depot Conductor: ఆర్టీసీ బస్సులో మహిళకు కాన్పు.. శెభాష్ అన్న వీసీ సజ్జనార్

సామాజిక బాధ్యత చొరవ కింద జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ‘అక్షజ’ అనే కార్యక్రమంతో గర్భిణీలు, ప్రసూతి మహిళల ఆరోగ్య సంరక్షణకు పాటుపడ్డారు. ఈ విధంగా, జిల్లాలో సుపరిపాలన అందించడం ద్వారా ఈ అవార్డుకు ఎంపికైన దేశంలోని 10 జిల్లాల కలెక్టర్లలో ప్రసన్న వెంకటేష్ ఒకరు. ఈ సంధర్బంగా అవార్డు అందజేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రసన్న వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిచేందుకు ప్రజా సేవకునిగా శక్తివంచన లేకుండా తాను కృషి ఆయన అన్నారు.

Just In

01

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు