Mala Parvathi and Ranjini
ఎంటర్‌టైన్మెంట్

Ranjini: సినీ ఇండస్ట్రీలో లైంగిక అంశాలను ‘మ్యానేజ్’ చేయాలన్న మాలా పార్వతి‌పై రంజని ఫైర్!

Ranjini: సినీ పరిశ్రమలో తమపై జరిగే అనుచిత ప్రవర్తనల పట్ల మహిళలు ప్రశ్నించకుండా ‘మ్యానేజ్’ చేసుకోవడం నేర్చుకోవాలని సీనియర్ నటి మాలా పార్వతి చేసిన వ్యాఖ్యలను నటి రంజని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా ఫేస్ బుక్ వేదికగా రియాక్ట్ అయిన రంజని, ఈ మాటలతో నీ పట్ల ఉన్న గౌరవం మొత్తం పోయిందనేలా పోస్ట్ చేశారు. ‘‘నిన్ను చూసి సిగ్గు పడుతున్నాను. నువ్వు శిక్షణ పొందిన సైకాలజిస్ట్‌వి, అలాగే న్యాయవాదివి కూడా. అయినప్పటికీ ఇలాంటి నేరస్తులకు మద్దతు ఇస్తున్నావు. నువ్వు అవకాశవాదివి. నిన్ను చూసి విచారిస్తున్నాను, ఈ మాటలతో నీ పట్ల ఉన్న గౌరవ భావన మొత్తం పోయింది’’ అని రంజని తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

Also Read- 6 Journey: చిన్న సినిమాల మధ్య సమరం.. ‘6 జర్నీ’ కూడా ఆరోజే విడుదల!

అసలీదంతా ఎందుకు వచ్చిందంటే, ‘దసరా’ విలన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నటుడు డ్రగ్స్ తీసుకుని, ఓ సినిమా షూట్‌లో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని విన్సీ సోనీ అలోషియస్ అనే నటి కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు, ‘అమ్మ’ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆమెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ టైమ్‌లో విన్సీ సోనీ అలోసియస్ మాటలను ఉద్దేశిస్తూ మాలా పార్వతి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిని భూతద్ధంలో చూడాల్సిన అవసరం లేదని, నటించడానికి వచ్చావు కాబట్టి ‘మ్యానేజ్’ చేసుకోగలగాలని, ఒక్క ‘నో’ అని చెబితే సరిపోతుందనేలా.. మాలా పార్వతి మాట్లాడిన మాటలపై నటి రంజనితో పాటు పలువురు మహిళలు మండిపడుతున్నారు.

సినిమా పరిశ్రమలోనే కాకుండా అన్ని పరిశ్రమలలో లైంగిక వేధింపులు సహజమే. దీనిని తీవ్రమైన అంశంగా పరిగణించకుండా నటీమణులు ‘మ్యానేజ్’ చేయడం నేర్చుకోవాలి. ఇటువంటి విషయాలను బయటకు చెబితే, ఈ రంగంలోని ఇతర మహిళలు మనుగడ సాధించలేరు. అటువంటి సమయాల్లో తెలివిగా వ్యవహరించి, మ్యానేజ్ చేసుకోగలగాలి. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా భావిస్తే, ఈ పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోలేరు. దానిని దృష్టిలో పెట్టుకుని నటీమణులు నడుచుకోవాలి అని మాలా పార్వతి చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, కొంతమందికి సాధారణ జోక్ కూడా అర్థం కాదు. నీ బ్లౌజ్ సరిచేస్తాను, నీతో పాటు నీ గదిలోకి వస్తాను అని నటులు అన్నప్పుడు దానిని సీరియస్‌గా తీసుకోకుండా సింపుల్‌గా ‘నో’ చెబితే సరిపోతుంది. ఇలా మ్యానేజ్ చేయడమే నేర్చుకోవాలి అన్నట్లుగా ఆమె ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీనికి ఓ ఉదాహరణ కూడా చెప్పిందండోయ్.. అదేంటంటే..

Also Read- Rashmi Gautam: ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీ గౌతమ్‌కి ఏమైంది?

మనం ఒక రోడ్డు దాటాలి. కానీ ఆ రోడ్డు మీద లారీలు, బస్సులు గ్యాప్ లేకుండా వెళుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు రోడ్డు దాటకుండా మనం వెనక్కి వెళ్లిపోతే నష్టపోయేది ఎవరు? అలాగే మహిళలు ఒక రంగంలో రాణించాలని వచ్చినప్పుడు, అక్కడ ఎదురయ్యే అనుచిత సందర్భాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ‘నువ్వు నాతో వస్తావా? నాతో పడుకుంటావా? నా పక్కకు రా’ ఇలాంటి వాటిని మనం ఎంతో తెలివిగా మ్యానేజ్ చేసుకోవాలి అని మాలా పార్వతి చెప్పుకొచ్చింది. కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, రంజని వంటి వారు మాత్రం ఇలా సోషల్ మీడియా వేదికగా నిరాశను వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే, ఈ మ్యాటర్ ఇంకా పెద్దది అయ్యేలానే కనిపిస్తుంది. చూద్దాం.. మాలా పార్వతి మాటలపై ఇంకా ఎవరెవరు రియాక్ట్ అవుతారో..!

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!