6 Journey Movie Team
ఎంటర్‌టైన్మెంట్

6 Journey: చిన్న సినిమాల మధ్య సమరం.. ‘6 జర్నీ’ కూడా ఆరోజే విడుదల!

6 Journey: ఏప్రిల్ 25న దాదాపు నాలుగైదు సినిమాలు విడుదలయ్యేందుకు రెడీ అవుతున్నాయి. వాటిలో ‘సారంగపాణి జాతకం’, జింఖానా’, ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు అదే రోజున విడుదలయ్యేందుకు మరో రెండు సినిమాలు కూడా సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన ‘సోదరా’ కాగా, ఇంకోటి ‘6 జర్నీ’. వీటితో ఏప్రిల్ 25న విడుదలయ్యే సినిమాల సంఖ్య 5కు చేరింది. ఇంకా ఈ నాలుగు రోజుల గ్యాప్‌లో రెండు మూడు సినిమాలు లైన్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ 5 సినిమాల ప్రమోషన్స్‌ని ఆయా చిత్రాల మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ‘6 జర్నీ’ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘6 జర్నీ’ చిత్ర విషయానికి వస్తే..

Also Read- Reddy Betting App: వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయా? నా అన్వేషణ షాకింగ్ వీడియో!

పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘6 జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు బసీర్ మాట్లాడుతూ.. సురేందర్ రెడ్డి మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపించారు. ఈ సినిమాలో నటించిన వారంతా అద్భుతంగా నటించారు. టేస్టి తేజ ఎనర్జీ లెవల్స్ అదుర్స్ అనేలా ఉంటాయి. సింహా మంచి పాటలు ఇచ్చారు. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతకు ధన్యవాదాలు. ట్రైలర్‌ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏప్రిల్ 25న వస్తున్న ఈ సినిమా కచ్చితంగా అందరినీ మెప్పిస్తుందని అన్నారు.

నిర్మాత పాల్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ల‌వ్‌, యాక్ష‌న్‌, మిస్ట‌రీ.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌ మా ‘6 జ‌ర్నీ’ మూవీలో ఉంటాయి. ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పందన వస్తుంది. బ‌సీర్‌ ఈ సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. ఏప్రిల్ 25న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. మంచి చిత్రాల‌ను ఆద‌రించే తెలుగు ప్రేక్ష‌కులు మా సినిమాను స‌పోర్ట్ చేస్తార‌ని న‌మ్ముతున్నామని తెలిపారు. హీరో స‌మీర్ ద‌త్త మాట్లాడుతూ, డిఫరెంట్ లవ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ‘6జర్నీ’ తెర‌కెక్కింది. ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. బ‌సీర్‌ సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తీసుకువస్తుందని భావిస్తున్నామని అన్నారు. హీరోయిన్ పల్లవి రాథోడ్ మాట్లాడుతూ, ఇందులో మంచి పాత్ర చేసినట్లుగా చెప్పారు. ఫుల్ లెంగ్త్ రోల్‌లో న‌టించిన 6 జ‌ర్నీ న‌టుడిగా మంచి గుర్తింపునిస్తుందని అన్నారు ‘బిగ్ బాస్’ ఫేమ్ టేస్టీ తేజ.

Also Read- Rashmi Gautam: ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీ గౌతమ్‌కి ఏమైంది?

మొత్తంగా అయితే ఏప్రిల్ 25న చిన్నపాటి సమరమే జరగబోతుందనేది మాత్రం, ఆరోజు విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాలను చూస్తుంటే తెలుస్తుంది. మరి ఈ సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో తెలియాలంటే మాత్రం ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. మే 1న స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో చిన్న సినిమాలు కాస్త తొందరపడుతున్నాయి. మే వచ్చిందంటే పెద్ద హీరోల సినిమాలు కూడా లైన్‌లోకి వచ్చేస్తాయి కాబట్టి, ఏప్రిల్‌లోనే తమ చిత్రాలను రిలీజ్ చేయాలని చిన్న నిర్మాతలు త్వరపడుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!