Rashmi Gautam
ఎంటర్‌టైన్మెంట్

Rashmi Gautam: ఆస్పత్రిలో.. యాంకర్ రష్మీ గౌతమ్‌కి ఏమైంది?

Rashmi Gautam: ఎప్పుడూ చలాకీగా, సరదాగా ఉండే రష్మీ గౌతమ్ (Anchor Rashmi Gautam).. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆమెకు డాక్టర్లు సర్జరీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం కూడా రష్మీ గౌతమ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో చెప్పడంతోనే అందరికీ తెలిసింది. ‘జబర్దస్త్’ షోలో తనదైన తరహా యాంకరింగ్‌తో ఇప్పటికీ అలరిస్తున్న రష్మీ, సండే వచ్చే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లోనూ తన జోెష్ చూపిస్తుంటుంది. మరి ఆమెకు ఏమైందనే విషయం కూడా బయటకు తెలియనీయకుండా సడెన్‌గా సర్జరీ అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని చెబుతూ ఆస్పత్రిలో ఉన్న ఫొటోలను రష్మీ గౌతమ్ షేర్ చేసింది. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అసలు రష్మీ గౌతమ్‌కి ఏమైందో.. ఆమె మాటల్లోనే.. ‘‘నాకు జనవరి నుంచి ఆరోగ్యం సరిగా లేదు. ఐదంటే ఐదు రోజుల్లోనే నా శరీరంలోని హెమోగ్లోబిన్ శాతం 9కి పడిపోయింది. అసలు నాకు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. విపరీతంగా రక్తస్రావంతో పాటు తీవ్రమైన భుజం నొప్పి నన్ను బాగా కృంగదీశాయి. వెంటనే డాక్టర్స్‌‌ని సంప్రదించాను. ఈ రెండింటిలో దేనికి ముందు ట్రీట్‌మెంట్ తీసుకోవాలో కూడా నాకు తెలియలేదు. మార్చి 29వ తేదీకి నా పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది. బాగా నీరసం అయిపోయాను.

Also Read- Reddy Betting App: వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయా? నా అన్వేషణ షాకింగ్ వీడియో!

అంతే, నాకు ఏదో అయిపోతుందని అర్థమైంది. వెంటనే నేను ఆల్రెడీ ఓకే చెప్పిన వర్క్స్ అన్నింటినీ పూర్తి చేసి, ఆస్పత్రిలో చేరాను. నాకు ఏప్రిల్ 18న సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. ఇంకో మూడు వారాలు విశ్రాంతి తీసుకుని, తిరిగి వస్తాను. ఈ సమయంలో నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచిన డాక్టర్స్ అలాగే నా కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

">

ఆమె పోస్ట్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎంతో హుషారుగా, ఎప్పుడూ నవ్వుతూ ఉండే రష్మీకి ఇలా అవ్వడం ఏంటి? అసలు ఆమెకు ఏమైంది? నువ్వు త్వరగా కోలుకోవాలి అక్కా.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మీ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆమె అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకొన్ని రోజుల్లోనే ఆమె కమ్ బ్యాక్ అవుతుందని, ఆమె కుటుంబ సభ్యులు సైతం తెలియజేశారు. సో.. రష్మీ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె ఫొటోలు చూస్తుంటే, ఆమె పెద్ద ఇష్యూనే జయించినట్లుగా అయితే అర్థమవుతుంది. త్వరలోనే ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

Also Read- Sodara: సంపూ ఈసారి నవ్వించడమే కాదు.. ఏడిపిస్తాడట! సంపూ ‘సోదరా’ విశేషాలివే!

రష్మీ గౌతమ్ యాంకర్‌గానే కాకుండా నటిగానూ కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఆమె హీరోయిన్‌గానూ కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వెండితెరపై చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తున్న రష్మీ.. బుల్లితెరపై మాత్రం తిరుగులేని యాంకర్‌గా దూసుకెళుతోంది. ఒకప్పుడు అనసూయకు పోటీగా ‘జబర్దస్త్’ని లీడ్ చేసిన ఈ భామ, అనసూయ ఆ షో నుంచి బయటకు వచ్చేయడంతో రష్మీనే మెయిన్ యాంకర్ అయ్యారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు