Sodara Movie Heroes
ఎంటర్‌టైన్మెంట్

Sodara: సంపూ ఈసారి నవ్వించడమే కాదు.. ఏడిపిస్తాడట! సంపూ ‘సోదరా’ విశేషాలివే!

Sodara: సంపూర్ణేష్‌ బాబు (Sampoornesh Babu).. ఈ పేరుకు పరిచయం అక్కరలేదు. ‘హృదయ కాలేయం’ సినిమాతో బర్నింగ్ స్టార్ గుర్తింపును సొంతం చేసుకున్న సంపూ.. ఆ తర్వాత కొన్ని వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న సంపూర్ణేష్ బాబు.. ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరించేలా ‘సోదరా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌ (Sanjosh) మరో హీరోగా నటిస్తున్నాడు. మన్‌ మోహన్‌ మేనం పల్లి దర్శకత్వంలో క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చాగన్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను హీరోలిద్దరూ మీడియాకు తెలియజేశారు. ముందుగా

Also Read- Reddy Betting App: వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయా? నా అన్వేషణ షాకింగ్ వీడియో!

సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ.. అన్నదమ్ములు అనే బంధం ఈ సృష్టిలో ఎంత గొప్పదో అందరికీ తెలుసు. ఎందరో రచయితలు కూడా ఇప్పటి వరకు ఎన్నో రూపాల్లో ఆ బంధం గురించి చెప్పారు. అలాంటి అన్నదమ్ముల బంధాన్ని కాస్త వైవిధ్యంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్న చిత్రమే ‘సోదరా’. ఇది నా గత చిత్రాల తరహాలో ఉండదని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఇది కుటుంబ కథా చిత్రం. ముఖ్యంగా ఇద్దరు అన్నదమ్ముల కథ. అన్నగా బరువు బాధ్యతలు ఉన్న పాత్రను ఈ చిత్రంలో నేను పోషించాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు అందరికీ తమ రియల్‌ లైఫ్‌ సంఘటనలు గుర్తుకువస్తాయని కచ్చితంగా చెప్పగలను. నా రియల్‌ లైఫ్‌లో ఉండే నరసింహా చారికి, ఈ చిత్రంలో చేసిన పాత్రకు చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. మొదటి మూడు నాలుగురోజులు ఈ పాత్రను చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. నాకు వేరే సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుండేవి. అయితే ఈ పాత్రలోని మూడ్‌ పోకూడదని ఈ సినిమా షూటింగ్ కంప్లీట్‌ అయ్యే వరకు వేరే సినిమా చేయలేదు.

ఈ చిత్రంలో జనరల్‌గా నా సినిమాల్లో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ అన్నదమ్ములకు ఫోన్‌ చేసి మాట్లాడతారు. అంతగా ఈ సినిమా కదిలిస్తుంది. ‘హృదయ కాలేయం’ తరహా కామెడీ అయితే ఇందులో ఉండదు. ఇందులో ఉండే వినోదం కూడా ఎంతో ఆహ్లాదంగా ఫ్యామిలీ మొత్తం నవ్వుకునేలా ఉంటుంది. అందరూ ‘హృదయ కాలేయం’ వంటి సినిమాలు మళ్లీ మీ నుంచి ఎందుకు రావడం లేదు? అని ఎక్కడికి వెళ్లినా అడుగుతున్నారు. ఆ స్థాయికి తగ్గ కథలు దొరకడం లేదు. ఈ మధ్య కొన్ని కథలు విన్నాను, కానీ పెద్దగా నాకు నచ్చలేదు. ‘హృదయ కాలేయం’ చిత్రానికి మించిన కామెడీ కథ దొరికితే మాత్రం కచ్చితంగా చేస్తాను. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో చేస్తున్నాను. ‘సూపర్‌ సుబ్బు’ అనే వెబ్‌ సీరిస్‌లో కూడా చేస్తున్నాను. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ముఖ్యంగా ఉపేంద్ర ‘ఏ’ సినిమా తరహా పాత్ర చేయాలని ఉందని చెప్పుకొచ్చారు.

Also Read- Balakrishna: ఫ్యాన్సీ నెంబర్ కోసం బాలయ్య ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

మరో హీరో సంజోష్‌ మాట్లాడుతూ.. నేను ఇంతకు ముందు ‘బేవర్స్’ అనే సినిమాలో హీరోగా చేశాను. సంపూతో కలిసి ఓ బ్రదర్‌గా ఈ సినిమాలో చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే కథ ఇది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి దర్శకుడు ఈ సినిమాకు బ్రోమాంటిక్‌ అని ట్యాగ్ పెట్టాడు. ఇది అమాయకుడైన అన్న, అప్డేట్ అయిన తమ్ముడి కథ. ఇలాంటి అన్నదమ్ముల కథతో ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా రాలేదని చెప్పగలను. అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. అన్నదమ్ములు కలిసి ఉండాలని కోరుకునే కథ. బాబుమోహన్‌ చాలా బాధ్యత గల పాత్రలో నటించారు. మాకు ఫాదర్‌గా నటించారు. స్వచ్ఛతకు మారుపేరుగా అన్నదమ్ముల అనుబంధంగా ఉండాలి. ఈ రోజుల్లో అలాంటి అనుబంధం కరువైపోయింది. ఎక్కడో కానీ అలాంటి అనుబంధాలు చూడటం లేదు. ఈ సినిమా చూసిన తరువాత ఒకరిద్దరు మారినా మాకు సంతోషమే. ప్రస్తుతం ఒక ఇగోయిస్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌కు, కామన్‌ మ్యాన్‌కు మధ్య జరిగే కథతో సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తామని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?