Damodar Rajanarsimha [ image credit;TWITTER]
తెలంగాణ

Damodar Rajanarsimha: ఆహార నాణ్యతలపై కఠిన హెచ్చరికలు.. మంత్రి ఆకస్మిక పర్యటన!

 Damodar Rajanarsimha: విద్యా సంస్థ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని, తాను మళ్లీ వారం రోజుల్లో వస్తానని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హెచ్చరించారు. శనివారం అందోలు వద్ద గల నర్సింగ్, పాలిటెక్నిక్, కేజీబీవీ కళాశాల, పాఠశాలలను సందర్శించారు. పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో మంత్రి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు అందించే బోజనంలో నాణ్యత లోపిస్తే జైలుకేనని మంత్రి హెచ్చరించారు. పాఠశాలల్లో మంత్రి æ విద్యార్థినిలతో మాట్లాడారు. పాఠశాలల్లో సౌకర్యాలపై ప్రిన్సిపాల్, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల ల్యాబ్‌లలో కొత్త కంప్యూటర్లు, డైనింగ్‌ హాల్‌లో కొత్త టేబుళ్లు, ఇతర సామాగ్రి సమకూర్చినందుకు మంత్రికి విద్యార్ధినిలు కృతజ్ఞతలు తెలిపారు. ల్యాబులలో ఏసీలు ఏర్పాటు చేయాలని విద్యార్ధినిలు మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు ఆదేశించారు.

Jobs In Japan: సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. జపాన్ లో ఉద్యోగాలు అవకాశాలు!

కళాశాల పరిసర ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. Sవారం రోజుల్లో మళ్లీ వస్తానని, కాలేజీ పరిశుభ్రంగా ఉండకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. Sకళాశాల వెనక భాగంలో ప్రహరిగోడæ ఎత్తు పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్ధినిలు ఆడుకునేందుకు అవసరమైన క్రీడా సామాగ్రిని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

కళాశాల , పాఠశాల కిచెన్‌లను, ఆహార సామాగ్రిని çస్వయంగా పరిశీలించారు. నర్సింగ్‌ కళాశాల విద్యార్ధినిలు కళాశాల నుంచి హాస్పిటల్‌కు, హాస్పిటల్‌ నుంచి కాలేజీకి వెళ్లడానికి కొత్త బస్సు ఏర్పాటు చేయిస్తానని విద్యార్థులకు మంత్రి హమీ ఇచ్చారు. అందోలులోని స్థలంలో నిర్మాణంలో ఉన్న 50 బెడ్ల మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం, వంద బెడ్ల ఏరియా హాస్పిటల్, నూతన నర్సింగ్‌ కళాశాల భవనాలతో పాటు కళాశాల ముందు నిర్మిస్తున్న బస్టాండ్‌లు, ఫోర్‌లైన్‌ రోడ్డు పనులను మంత్రి పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు, స్థానికులు మంత్రి వెంట ఉన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?