CM Revanth (Image Source: TG CMO)
తెలంగాణ

CM Revanth: అభివృద్ధిలో ప్రపంచంతోనే పోటీ.. టార్గెట్ చెప్పేసిన సీఎం

CM Revanth: తెలంగాణలో డ్రై పోర్టును ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తయారు చేయబోతున్నామని వెల్లడించారు. జపాన్ లో తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని వివరించారు.

పర్ ఫెక్ట్ ప్లాన్ తో

ఇతర రాష్ట్రాల్లో పోల్చితే బెటర్ గా వర్క్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులు ఆకర్షణకు పర్ ఫెక్ట్ ప్లాన్ తో ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ ను పరిశీలించామన్నారు. హైదరాబాద్ మూసీ నదీ డెవలప్ కు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగానే వివిధ దేశాల్లోని నదులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కానీ మూసీ ప్రక్షాళనకు బీఆర్ ఎస్ అడ్డుకుంటుందన్నారు.

 ఢిల్లీ నుంచి గుణపాఠం

కాలుష్య కారణ మూసీని ప్రక్షాళన చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్ఫష్టం చేశారు. దీని వలన హైదరాబాద్ ప్రజలకు పొల్యుషన్ సమస్య తగ్గుతుందన్నారు. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇచ్చే పరిస్థితి ఉన్నదన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ గుణపాఠం నేర్చుకోవాలన్నారు. మూసీ ప్రక్​షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ వంటివి తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైనవన్నారు.

Also Read: Subbareddy on Vijayasai Reddy: విజయసాయిరెడ్డిపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్.. గట్టిగా ఇచ్చి పడేశారుగా!

అభివృద్ధిలో భాగస్వామ్యం

తెలంగాణలో పెట్టుబడులు పెరగాలని, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి ఛాన్స్ లు కూడా పెరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఎవరికి చేతనైనంత వారు సహకరిస్తే, ప్రపంచంతో పోటీ పడవచ్చన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో? అందరికీ తెలుసునని క్లారిటీ ఇచ్చారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!