Atma Committee( image credit: swetcha reporter)
తెలంగాణ

Atma Committee: ఆత్మ కమిటీకి కొత్త ఆశ.. రైతులకు లాభకరమైన పద్ధతులు.. ఆరోగ్యశాఖ మంత్రి!

Atma Committee: ఆత్మ కమిటీలు రైతు సంక్షేమం కోసం పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్‌ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. రాయికోడు ఆత్మ కమిటీ చైర్మన్‌ కచూర్‌ రావుతో పాటు సభ్యుల ప్రమాణ స్వీకారం కారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ అందోల్‌ నియోజకవర్గంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయికోడ్, వట్పల్లి, మునిపల్లి మండలాల అభివృద్ది కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ది చెందాలంటే రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపడాలని అందుకోసం ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గ పరిధిలోని రోడ్లకు మరమ్మత్తులు చేపట్టడంతో పాటు నూతన రోడ్ల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య సౌకర్యాలు మెరుగు కోసం వట్పల్లిలో రూ. 15 కోట్లతో ఏరియా ఆసుపత్రి నిర్మాణం అల్లాపూర్‌ సింగీతం గ్రామాలలో నూతనంగా ఒక్కొక్కటి ఐదు కోట్ల తో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నట్లు మంత్రి తెలిపారు.

 Also Read: MLA Madhava reddy: ప్రభుత్వమే ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది.. నర్సంపేట ఎమ్మెల్యే హామీ!

ఆత్మ కమిటీ సభ్యులు రైతుల మనసు లో స్థానం పొందేలా రైతులకు అధునాతన పద్ధతులపై తరచూ శిక్షణలు ఇవ్వాలని, రైతులకు అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నిరుద్యోగ యువకుల కోసం రాజీవ్‌ యువ వికాసం పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువకులు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు.

ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిందన్నారు. గతంలో రేషన్‌ దుకాణాలలో వచ్చే బియ్యాన్ని ఎవరు తినేవారు కారని తిరిగి దళారులకు కానీ ఇప్పుడు సన్న బియ్యం కోసం క్యూ లైన్‌ లో నిలబడి ప్రజలు కొనుగోలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్విన్‌ చైర్మన్‌ గిరిధర్‌ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ అంజయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుధాకర్, , ఆత్మ కమిటీ చైర్మన్‌ నాలాచెరు కచూర్‌ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ఆర్డీవో రామిరెడ్డి , ఎ డి ఎ సత్యనారాయణ, ఎంపీడీవో షరీఫ్, ప్రజా ప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?