Bhu Bharathi Act: భూభారతి చట్టంతో రైతులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని.. ఇన్నాండ్లు పడిన భాదలు తప్పుతాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వాస్తవ సాగులో ఉన్న రైతులకు ఈ చట్టంతో హక్కులు లభిస్తాయని వివరించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా భూములు కోల్పోయిన వారికి తిరిగి ఇప్పించేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ధరణి తో మధ్యలో వచ్చిన వారిని పంపిస్తాని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పూసయి గ్రామంలో భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే చెప్పినట్లు గానే ధరణిని బంగాళాఖతంలో వేషామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి తో రైతులు అనేక తిప్పలు పడ్డారని, తప్పుల సవరణ కు కూడా అవకాశం లేకుండా పోయిందని తెలిపారు.
Also Reafd: Bhu Bharati Act: మీ భూమి సమస్యకు ఇక పరిష్కారం.. భూభారతిలోనే.. కొత్తగూడెం కలెక్టర్!
కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ని 18రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను పరిశీలించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్ఛామని గుర్తు చేశారు. ఈ చట్టం అసెంబ్లీ లో అమలుకాకుండా బీఆర్ ఎస్ వాళ్ళు పడ్డారని పేర్కొన్నారు. ధరణిలో తప్పులు ఉన్నాయని తెలిసి కూడా అప్పటి ప్రభుత్వం సవరించలేదని పేర్కొన్నారు. తాజా గా తీసుకొచ్చిన భూ భారతి తో రైతులు ఎక్కడ తిరగాల్సిన పని లేదని అన్నారు. ఇప్పటి వరకు సాదా బైనామా లు రాష్ట్రంలో 9.20లక్షలు పెండింగ్ లో ఉన్నాయని వాటన్నింటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
పార్ట్ బీ కి సంబందించి 18లక్షల్లో 6.50లక్షల అప్లికేషన్ లు పరిష్కారం కాలేదని వాటిని కూడా పరిష్కరిష్టమని చెప్పారు. ప్రతి వ్యక్తి కి ఆధార్ ఉన్నట్లు గానే ప్రతి రైతుకు భూదార్ ఉంటుందని తెలిపారు. రైతుల సమస్యల పట్ల రెవిన్యూ అధికారులు శానుకూలంగా వ్యవహారించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఏంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే లు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ల శాఖ ముఖ్య కార్యదర్శి బుద్ధ ప్రకాష్, జిల్లా కలెక్టర్ రాజర్శి షా తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు