Dharmapuri Arvind on Kavitha: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై బీఆర్ఎస్ ముఖ్యనేత కల్వకుంట్ల కవిత చేసిన వివాదస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కవిత వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన నేతలు సోషల్ మీడియా వేదికగా కవితపై విరుచుకుపడ్డారు. అటు తెలంగాణ జనసేన పార్టీ ఇంఛార్జ్ సైతం కవిత (Kalvakuntla Kavitha)పై సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఘటనపై బీజేపీ ముఖ్యనేత, ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) స్పందించారు. కవితపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
పవన్ త్యాగం చేశారు..
తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింద్.. చిరంజీవి (Chiranjeevi), పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చిరంజీవి గారితో మాట్లాడానని.. రాజకీయ నుంచి తప్పుకున్నప్పటికీ ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది రాలేదని ఆయన తనతో చెప్పారని అర్వింద్ అన్నారు. అయితే పవన్ రాజకీయాల్లోకి రావడం చాలా పెద్ద త్యాగమని ఎంపీ అభిప్రాయపడ్డారు. చిరు కంటే పవన్ నాలుగింతలు సంపాదిస్తున్నారని గుర్తుచేశారు. అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారని ప్రశంసించారు. ప్రజల కోసం రోడ్లపై తిరుగుతున్నట్లు అభినందించారు.
కవితకు సెటైర్లు..
ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత.. యాధృచ్చికంగా పవన్ డిప్యూటీ సీఎం అయ్యారని పేర్కొన్నారు. ఆయన సీరియస్ పొలిటిషియన్ కాదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఆమెకు చురకలు అంటించారు. పవన్ తన కోట్లాది మంది అభిమానుల ద్వారా ఫేమ్ సంపాదించారని పేర్కొన్నారు. మరి కవిత.. బ్యూటీ పార్లర్ పెట్టి ఫేమ్ సంపాదించారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై ఆమె సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
BJP MP @Arvindharmapuri Slams Kavitha 🔥 @PawanKalyan ఆయన సినిమాల్లో సంపాదించింది అంత వదులుకుని ప్రజలకి మంచి చేయాలని రాజకీయంలోకి వచ్చాడు.
కవిత Beauty Parlour పెట్టి Fame సంపాదించింది 🤣🔥 pic.twitter.com/fg5HUxgj5D
— Harika Reddy 🥛 (@Harika_JSP) April 17, 2025
కించ పరిచే హక్కు లేదు
ఇటీవల ఇదే అంశంపై మాట్లాడిన ధర్మపురి అర్వింద్.. కవిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టం అని కవిత అనడం ఆమె అహంకారానికి నిదర్శనమని అన్నారు. ప్రజలను ఎన్నుకున్న నాయకులను కించ పరిచే హక్కు ఆమెకు లేదని స్ఫష్టం చేశారు. ప్రజల తీర్పును గౌరవించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదని ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. తాము జాతీయ వాదాన్ని మోస్తామని.. కవితలా లిక్కర్ స్కామ్ సంచులు మోయమని అరవింద్ చురకులు అంటించారు.
జనసేన సెటైర్లు
పవన్ సీరియస్ పొలిటిషియన్ కాదంటూ కవిత చేసిన కామెంట్స్ పై జనసేన శ్రేణులు (Janasena Cadre) తీవ్రస్థాయిలో స్పందించారు. అలా అనిపించుకోవాలంటే నీలాగా స్కామ్స్ చేయాలా అంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లినా మార్పు రాలేదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. గతంలో వైసీపీ గెలుపునకు బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో కష్టపడిందో అందరికీ తెలుసని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎవరు పట్టించుకోవడం లేదన్న భావనలో కవిత ఉందని.. అందుకే పవన్ పై విమర్శలు చేయడం ద్వారా అయిన వార్తల్లో నిలవాలని కవిత ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.