Mega157 Update
ఎంటర్‌టైన్మెంట్

Mega157: అయ్యబాబోయ్.. అనిల్ మాములు స్కెచ్ వేయలేదుగా!

Mega157: అనిల్ రావిపూడి వరుస సక్సెస్‌లతో.. స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లోకి చేరాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ విజయాలు సాధించడంతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్‌ను అనిల్ రావిపూడి క్రియేట్ చేశాడు. మరికొందరు అయితే అనిల్‌ని రాజమౌళితో పోల్చుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అనిల్ రావిపూడి బలం కామెడీ. ఆ కామెడీ సరిపడా సరుకును రెడీ చేసి, సెట్స్‌పైకి వెళ్లే ముందే అంతా పక్కాగా ప్లాన్ చేసుకుని దిగుతాడు. నిర్మాతకు చెప్పిన టైమ్‌కి లేదంటే అంతకంటే ముందే సినిమాను పూర్తి చేసి ఇవ్వడంలోనూ అనిల్ తోపు డైరెక్టర్‌గానే పేరు పొందాడు. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తిరుగులేని విజయాన్ని, రికార్డును అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకున్నాడు.

Also Read- Sumaya Reddy: కష్టపడి సంపాదించిన డబ్బు అలా ఖర్చు పెడుతుంటే బాధగా ఉండేది

దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలందరూ క్యూ కడుతుంటే, మరోసారి ఆయన సీనియర్ హీరోకే ఓటేశారు. విక్టరీ వెంకటేష్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఉండబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా అధికారికంగా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఆ వెంటనే డ్యూటీ ఎక్కేసిన అనిల్ రావిపూడి.. మరోసారి తన ప్రమోషన్స్ పవర్ ఏంటో చూపించాడు. మెగాస్టార్ చిరంజీవికి చిత్ర సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ ఆయన విడుదల చేసిన వీడియో, ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఈ సినిమా కోసం అనిల్ మరో భారీ స్కెచ్ వేసినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అవును, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుంటే, మరో సీనియర్ హీరో కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నాడట. ఆ హీరో మరెవరో కాదు, అనిల్‌తో ఇప్పటికి హ్యాట్రిక్ చిత్రాలు పూర్తి చేసిన విక్టరీ వెంకీనే. అవును, ఈ సినిమాలో చిరంజీవితో కలిసి వెంకీ కూడా సందడి చేయనున్నారనేలా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో టాక్ నడుస్తుంది. వాస్తవానికి చిరు రీ ఎంట్రీ సినిమాలో నటించాలని వెంకటేష్‌తో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఆశపడ్డారు. అందులో సల్మాన్‌కి రీ ఎంట్రీ సినిమాలో నటించే అవకాశం లభించకపోయినా, ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చేసే అవకాశం వచ్చింది.

Also Read- Mouni Roy: అందాలతో పిచ్చెక్కిస్తున్న నాగిని బ్యూటీ

కానీ వెంకటేష్‌కి మాత్రం ఇంకా ఆ కోరిక అలాగే ఉంది. తన కోరికను అనిల్ రావిపూడికి చెప్పగా, వెంటనే వెంకీ కోసం ఓ పాత్రని అనిల్ క్రియేట్ చేశాడని, అది కూడా అదిరిపోతుందని అంటున్నారు. మరి దీనిపై అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఎలా అయితే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారో, ఇందులోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారట. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ ‌నుంచి ప్రారంభం కానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?