Sumaya Reddy
ఎంటర్‌టైన్మెంట్

Sumaya Reddy: కష్టపడి సంపాదించిన డబ్బు అలా ఖర్చు పెడుతుంటే బాధగా ఉండేది

Sumaya Reddy: తెలుగమ్మాయిలు టాలీవుడ్‌లో రాణించడం చాలా కష్టం అనే నానుడిని దాటుకుని, హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా తన మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది నటి సుమయ రెడ్డి. పృథ్వీ అంబర్, సుమయ రెడ్డి హీరోహీరోయిన్లుగా సుమ చిత్ర ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘డియర్ ఉమ’ (Dear Uma). ఈ సినిమాకు నిర్మాతగా, హీరోయిన్‌గానే కాకుండా రచయితగానూ సుమయ రెడ్డి బాధ్యతలను నిర్వహిస్తోంది. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సుమయ రెడ్డి చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ..

Also Read- Hansika Motwani : స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కుర్రకారు మతి పోగొడుతోన్న బన్నీ హీరోయిన్.. ఫోటోలు వైరల్

‘‘మాది అనంతపూర్. మోడలింగ్ రంగం నుంచి ఎంతో ప్యాషన్‌తో సినీ రంగం వైపు వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. మొదట్లో సినిమాలు చేయడం అంటే చాలా ఈజీ అనుకునేదాన్ని. కానీ అది అంత సులభం కాదని నాకు ఇప్పుడర్థమైంది. కరోనా టైంలో నాకు ప్రతీ రోజూ ఓ కల వస్తూ ఉండేది. అది నన్ను వెంటాడుతూ ఉన్నట్టుగా అనిపించేది. అలా ఆ కలలో వచ్చిన పాయింట్ మీదే ఈ కథను రాసుకున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యేలా మా చిత్రం ఉంటుంది. ఇందులో ముందు తెలుగు హీరోని ట్రై చేశాం. కానీ చాలా కారణాల వల్ల మిస్ అవుతూ వచ్చాం. కానీ పృథ్వీ అంబర్‌కి కథ చెప్పిన వెంటనే ఓకే చేశారు. కొత్త ప్రొడక్షన్ అని కూడా చూడకుండా కథ నచ్చిన వెంటనే ఆయన ఓకే చెప్పారు.

ఇందులో కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరిగే వాటిని చూపించబోతున్నాం. డాక్టర్లు, పేషెంట్స్‌కి మధ్యలో ఉండే పర్సన్స్‌ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో అనేది ఈ సినిమాలో చాలా క్లారిటీ చూపిస్తాం. ఇది కాస్త ఫిక్షనల్, కాస్త రియల్. సోషల్ మెసెజ్ అని కాకుండా ఓ సొల్యూషన్‌ని కూడా ఇందులో ఇస్తున్నాం. అందరికీ అవగాహన కల్పించేలా ఈ సినిమా ఉంటుంది. హీరోయిన్‌గా ఉండి నిర్మాతగానూ సినిమా చేయాలని అనుకోలేదు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చింది.

Also Read- Anupama Parameswaran: ఆ కిస్సులేంటి? ఆ హీరో కొడుకుతో అనుపమ డేటింగ్ నిజమేనా?

ఈ సినిమాకి ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయింది. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరినీ కాస్త పేరున్న వాళ్లని తీసుకున్నాం. ఆర్టిస్టుల్ని కూడా చాలా పెద్ద వాళ్లని తీసుకున్నాం. అలా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఈ సినిమాకు బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. నాకు నటించడం చాలా సులభంగా అనిపించింది కానీ, నిర్మాతగా ఉండటం చాలా కష్టం. అసలు ఒక్కోసారి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నామో కూడా తెలీయకుండా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు అలా ఉపయోగం లేకుండా ఖర్చు పెడుతుంటే బాధగా ఉండేది. ఈ చిత్రం కోసం మొదట మేం అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా పెట్టేశాను.

దర్శకుడు సాయి రాజేష్ మహాదేవ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను రెడీ చేసిన ‘డియర్ ఉమ’ కథను ఆయనకు చెప్పాను. ఆయన ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఆయన ఓకే అన్న తర్వాతే ఈ సినిమాను ప్రారంభించాం. ఈ సినిమాకు రదన్ మ్యూజిక్, రాజ్ తోట సినిమాటోగ్రఫీ హైలెట్‌గా ఉంటాయి. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా అందరినీ అలరించే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది. మంచి మెసేజ్ ఇందులో ఉంది. అది అందరూ తెలుసుకోవాలి’’ అని సుమయ రెడ్డి చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు