Lady Aghori (image credit:Twitter)
తెలంగాణ

Lady Aghori: లేడీ అఘోరీ అరెస్ట్ తప్పదా? ఏపీ పోలీసులా? తెలంగాణనా?

Lady Aghori: లేడీ అఘోరీ అరెస్ట్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. లేడీ అఘోరీపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కేసులు నమోదు కాగా, ముందు ఎవరు అరెస్ట్ చేస్తారన్నదే ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. అయితే ఈ చర్చ అటు ఉంచితే, శ్రీ వర్షిణిని అఘోరీ పెళ్లి చేసుకున్న వీడియోలు మాత్రం ఓ వైపు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొదటి భార్య అంశం తెరపైకి వచ్చినందుకే, లేడీ అఘోరీ హడావుడిగా శ్రీ వర్షిణిని పెళ్లి చేసుకుందన్న వాదన వినిపిస్తోంది.

లేడీ అఘోరీ పై రోజుకొక వార్తలు పుట్టుకొస్తున్నాయి. శ్రీ వర్షిణి వివాదం నుండి నిన్న తెరపైకి వచ్చిన మొదటి భార్య వివాదం వరకు లేడీ అఘోరీ సంచలనంగా మారింది. కానీ లేడీ అఘోరీ మాటలు, చేతలు మాత్రం యమ స్పీడ్ గా ఉన్నాయని పలువురి అభిప్రాయం. ఎందుకంటే శ్రీ వర్షిణిని పెళ్లి చేసుకోవడం, నిన్న మొదటి భార్య వివాదం తెరపైకి రాగానే, ఆ వీడియోలు రిలీజ్ చేయడంతో పక్కా ప్లాన్ తో లేడీ అఘోరీ అడుగులు వేస్తున్నట్లు నెటిజన్స్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

అంతేకాదు హైదరాబాద్ లో లేడీ అఘోరీపై కేసు నమోదైన విషయం కూడా తెరపైకి వచ్చింది. ఓ మహిళను మోసం చేసి మరీ డబ్బులు గుంజినట్లు ఈ కేసు సారాంశం. కాగా ఇప్పటికే ఏపీ, తెలంగాణలో అఘోరీపై పలు కేసులు నమోదై ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు దృష్టి సారించలేదన్నది పెద్ద ప్రశ్న. సమాజంలో భయాన్ని పుట్టించే మాటలు, తాంత్రిక పూజలు చేసి అంతు చూస్తానంటూ హెచ్చరికలు ఇవన్నీ చూసి హిందూ సమాజమే చీదరించుకుంటోంది. ప్రధానంగా శ్రీ వర్షిణి వ్యవహారంలో ఒక తల్లి పడ్డ ఆవేదనకు ప్రజలు మద్దతునిచ్చారు.

Also Read: Allu Arjun – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నివాసానికి హీరో అల్లు అర్జున్..

నిన్న మొదటి భార్య తెరపైకి రావడంతో లేడీ అఘోరీ మాటెత్తితే చాలు భగ్గుమంటున్నారు మహిళా లోకం. అంతేకాదు ట్రాన్స్ జెండర్స్ కూడా లేడీ అఘోరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ , తమ మర్యాద తీయవద్దని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు. ఇలా లేడీ అఘోరీ అంశం రోజుకొక వివాదం సృష్టిస్తోంది. అఘోరాలు అంటే పవిత్రులు. సమాజహితం కోసం, లోక కళ్యాణార్థం పూజలు చేసే వారు. వారి రాకపోకలు అంతా అద్భుతం. కానీ లేడీ అఘోరీ మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటూ వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నా, పోలీసులు ఎందుకు స్పందించడం లేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

అయితే పోలీసులు కూడా సరైన సమయం కోసం వెయిటింగ్ లో ఉన్నట్లు, ఇక మున్ముందు లేడీ అఘోరీకి చుక్కలేనని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా ఒక యువతి జీవితాన్ని, మరో మహిళ లైఫ్ ను, మరో మహిళను మోసం చేసి డబ్బులు గుంజిన లేడీ అఘోరీని వదిలి పెట్టకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఇంతకు లేడీ అఘోరీని అరెస్ట్ చేసేది ఏపీ పోలీసులా? తెలంగాణ పోలీసులా అన్నది మున్ముందు తేలాల్సి ఉంది.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు