Allu Arjun – Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ( Mark shankar pawanovich ) పెను ప్రమాదం తప్పింది. పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవా ( Anna Lezhneva ) దంపతుల చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. ఇటీవలే సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకొని గాయాల పాలయ్యాడన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే, బాబు సురక్షితంగా ఉండటంతో సినీ నటులు, ప్రముఖులు పవన్ ఇంటికి వెళ్తున్నారు. అయితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల బన్నీ పుట్టిన రోజున మెగా ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో, ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయేమో అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. తన భార్యతో కలిసి అల్లు అర్జున్ ( Allu Arjun) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. సింగపూర్ లో జరిగిన ఘటనలో పవన్ కొడుకు ప్రమాదం నుంచి బయట పడిన విషయం అందరికి తెలిసిందే.
Also Read: Scariest Sea Animal: మొక్కలా కనిపించే అత్యంత భయంకరమైన ఈ సముద్ర జంతువు గురించి తెలుసా?
ఈ క్రమంలోనే మార్క్ శంకర్ ( Mark shankar pawanovich ) ను చూసేందుకు అల్లు అర్జున్ దంపతులు పవన్ ఇంటికి వెళ్లారు. పవన్ కొడుకును చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో పవన్ కుటుంబాన్ని పరామర్శించి, చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలిసిన సమాచారం. మార్క్ శంకర్ ఘటన తర్వాత చిరంజీవి దంపతులు పవన్ తో పాటు సింగపూర్ వెళ్లారు. ఆ సమయంలో అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఒక్కరూ వెళ్ళింది లేదు. అలాగే, ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. వీరి మధ్య నిజంగానే గ్యాప్ వచ్చిందేమో అని అందరూ విమర్శలు చేయడంతో అర్జున్ పవన్ ఇంటికి వచ్చి పరామర్శించినట్లు తెలుస్తోంది.
కొన్నేళ్ల నుంచి పవన్ కు దూరంగా ఉన్న బన్నీ.. మార్క్ శంకర్ గురించి కలవడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ఏదొక వార్ జరుగుతూనే ఉంటుంది. వీరిద్దరూ కలవడంతో ఇప్పుడైనా ఈ వార్ కు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు