Damodar Rajanarsimha (imagecredit:swetcha)
తెలంగాణ

Damodar Rajanarsimha: వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదు.. మంత్రి దామోదర రాజనర్సింహా

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Damodar Rajanarsimha: ఎస్సీ వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదని మంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు. దళితుల్లో ఉన్న అతర్గత వెనుకబాటు తనం, అసమానను తొలగించేందుకు వర్గీకరణ చేశామన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన ఎనిమిదిన్నర నెలల కాలంలోనే పూర్తి చేయడం సంతోషంగా ఉన్నదన్నారు. సోమవారం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జీవో తొలి కాపీని, సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు.అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహా మీడియాతో మాట్లాడుతూ దశాబ్ధాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిందన్నారు.

సమానత్వం, సామాజిక న్యాయం కోసమే జీవితాంతం పరితపించిన రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు వర్గీకరణ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరడం సంతోషకరంగా ఉన్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత, కమిట్ మెంట్ వల్గే వర్గీకరణ ఆకాంక్ష ఇంత స్వరగా సాకారమైందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టీస్ షమీమ్ అక్తర్, కెబినేట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబులకు ధన్యవాదాలు తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలు:

సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలు, ఎంపిరికల్ డేటా, విద్య, ఉద్యోగ అవకాశాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన స్థితిగతులను పరిగణలోకి తీసుకుని 59 షెడ్యూల్డ్ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లను కేటాయించాలని వన్ మ్యాన్ కమిషన్ సూచించిందన్నారు. రిపోర్ట్ ఆధారంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూపు 1లో చేర్చి, వారికి 1 శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగిందన్నారు. వీరికి జనాభా ప్రకారం 0.5 శాతం రిజర్వేషన్ రావాల్సి ఉన్నప్పటికీ, వారు అత్యంత వెనుకబడి ఉన్నందున ఒక శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి అభ్యున్నతికి అండగా నిలవడం జరిగిందన్నారు.

రిజర్వేషన్ల ద్వారా మధ్యస్తంగా ప్రయోజనం పొందిన 18 కులాలను గ్రూపు 2లో చేర్చి, వీరికి 9 శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగిందన్నారు. మెరుగైన ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్ 3లో చేర్చి, వారికి 5 శాతం రిజర్వేషన్ కేటాయించామన్నారు.59 కులాల్లో 33 కులాలు పాత వర్గీకరణలో ఏ గ్రూపులో ఉన్నాయో, కొత్త వర్గీకరణలోనూ అదే గ్రూపులో కొనసాగుతున్నాయన్నారు. 26 కులాలు మాత్రమే షప్లీంగ్ అయ్యాయని వివరించారు. ఎస్సీల జనాభాలో ఈ 26 కులాల జనాభా 3.43 శాతం మాత్రమేనని వెల్లడించారు.

Also Read: Chevella Tragedy: దామరిగిద్దలో దారుణం.. కారులో ఊపిరి ఆడక చిన్నారులు మృతి..

2026 జనాభా లెక్కల తర్వాత, ఎస్సీల జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. 2013లో సమైక్య రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ సబ్ ప్లాన్ చేసే అవకాశం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సీడబ్లూసీలో‌ సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నాయకత్వానికి, నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వినిపించే అవకాశం దక్కడం, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం భాగమయ్యే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు