Nani Love Story ( Image Source: Twiter)
ఎంటర్‌టైన్మెంట్

Nani Love Story: 15 ఏళ్ళ క్రితం ఓ అమ్మాయి కోసం వైజాగ్ వచ్చేవాడ్నిఅంటూ లవ్ స్టోరీ గురించి చెప్పిన హీరో నాని

Nani Love Story: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ చిత్రం హిట్‌-3. సినిమాకి శైల‌ష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వహించారు. హిట్ ఫ్రాంఛైజీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రాంఛైజీ నుంచి ముచ్చటిగా వస్తున్న మూడో చిత్రం హిట్‌-3. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ మూవీ పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఎందుకంటే, హిట్ 1, హిట్ 2 ఎంత పెద్ద విజయం సాధించాయో మనకీ తెలిసిందే.

Also Read:  UPI Down: దేశంలో నిలిచిపోయిన గూగుల్ పే, ఫోన్ పే చెల్లింపులు.. ఎందుకంటే?

మూవీలో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న నాని హిట్ 3 ట్రైలర్ రోజు రిలీజ్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. సందర్భంగా హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Minister Sridhar Babu: గతంలోలా కోతలుండవ్.. పక్కా లెక్కలున్నాయ్.. మంత్రి శ్రీధర్ బాబు

నాని మాట్లాడుతూ ” 15 ఏళ్ళ క్రితం, నా పెళ్ళికి ముందు ఇక్కడికి ఒక అమ్మాయిని కలవడానికి వచ్చే వాడిని. తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అప్పుడు వచ్చింది ప్రేమ కోసమే.. ఇప్పుడు వస్తుంది ప్రేమ కోసమే.. ఒక స్పెషల్ బాండ్ ఏర్పడిపోయింది. వేరే ఊర్లకి వెళ్లినప్పుడు నన్ను అక్కడ ఒక అన్న లాగా, తమ్ముడి లాగా చూస్తారేమో కానీ, వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుడు లాగే చూస్తారనితన మాటల్లో చెప్పుకొచ్చాడు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!