Good Bad Ugly: పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం హైదరాబాద్‌లో బ్లాక్ బస్టర్ సంభవం పేరుతో సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ.. ‘‘తెలుగులో చాలా బ్లాక్ బస్టర్స్ తీశాము. ఈ సినిమాని రోహిణి థియేటర్‌లో చూశాము. థియేటర్ ప్యాక్డ్‌గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఆ విజువల్‌ని మర్చిపోలేను. సినిమా హ్యుజ్ బ్లాక్ బస్టర్. డైరెక్టర్ అధిక్ అద్భుతమైన సినిమా ఇచ్చాడు. అజిత్ చాలా సింపుల్ పర్సన్. ఆయన మనసుతో మాట్లాడే మనిషి. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అధిక్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఈ సినిమాని 95 రోజుల్లో పూర్తి చేశాడు. ఇంత గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాని కేవలం 95 డేస్‌లో కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. అధిక్ లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి కావాలి. జివి, ప్రియా, కార్తీక్ అందరికీ థాంక్యూ. సునీల్‌తో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఈ సినిమా రెండు గంటల రోలర్ కోస్టర్ రైడ్. ఎక్కడా ఆగదు, పరిగెడుతూనే ఉంటుంది. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ అన్నిచోట్ల సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇది ఇక్కడితో ఆగదు. చాలా పెద్ద విజయం సాధించబోతుంది’’ అని అన్నారు.
Also Read- Anna Konidela: పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన అన్నా.. ఫొటోలు వైరల్
దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి మ్యూజిక్ స్ట్రాంగ్ పిల్లర్. జీవి ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియా క్యారెక్టర్ ఆడియన్స్‌ని అలరించింది. కార్తికేయ క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా కీలకం. సునీల్ ఇందులో క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అజిత్ కూడా ఆ పాత్రని సునీల్ చేస్తేనే బాగుంటుందని అన్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌కి థాంక్యూ. వాళ్లు తమిళ్‌లో చేసిన ఫస్ట్ సినిమా ఇది. నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా హ్యుజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం నవీన్. మైత్రి మూవీ మేకర్స్ తమిళనాడులో హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలని తెలిపారు.
Also Read- Manchu Lakshmi: మనోజ్‌ని చూసి మంచు లక్ష్మి భావోద్వేగం.. అసలేం అర్థం కావట్లే!
యాక్టర్ సునీల్ మాట్లాడుతూ.. డైరెక్టర్ అధిక్‌కు థ్యాంక్స్. ఆయనే నా ఫస్ట్ తమిళ్ సినిమా ‘మార్క్ ఆంటోనీ’లో ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఏం చెప్తే అది చేశాను. ఆయన టైమింగ్‌తోనే యాక్ట్ చేశా. ఈ సినిమాని ఆయన చాలా డిఫరెంట్‌గా తీశారు. అజిత్ సినిమాలన్నిటికీ సీక్వెల్‌లా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్‌కి పర్ఫెక్ట్ డైరెక్టర్ అధిక్. ఆయన డైరెక్షన్ చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఫస్ట్ టైమ్ తమిళ్‌లో సినిమా చేసి మంచి హిట్ కొట్టిన మైత్రి మూవీ మేకర్స్‌కి కంగ్రాట్స్. ఇలానే అన్ని భాషల్లో మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సింపుల్ సిటీ హైయెస్ట్ గ్రేడ్‌లో ఉన్న మనిషి అజిత్. ఆయన ఎనర్జీ అద్భుతం. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ‘గబ్బర్ సింగ్’ సినిమా చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏరకంగా పూనకాల్లోకి వెళ్లారో.. ఈరోజు అజిత్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసి అంత ఎంజాయ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా పలువురు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు