Anna Konidela
ఎంటర్‌టైన్మెంట్

Anna Konidela: పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన అన్నా.. ఫొటోలు వైరల్

Anna Konidela: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) సతీమణి అన్నా కొణిదల ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లయిందని, ఈ సందర్భంగా కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారికి అన్నా కొణిదల మొక్కుకున్నారు. శనివారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి పవన్ కళ్యాణ్, అన్నా తమ బిడ్డను తీసుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Anna Konidela
Anna Konidela

Also Read- Tribanadhari Barbarik: సత్యరాజ్‌కు నమ్మకం పెరిగింది.. అందుకే ఆ రీల్స్!

ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆమె, కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి మొక్కులు చెల్లించుకొనేందుకు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ నిబంధనలు అనుసరిస్తూ – గాయత్రి సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం వరాహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వరాహ స్వామి వారి దర్శనం తర్వాత పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్నారు. అక్కడ భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించారు.

Anna Konidela
Anna Konidela

సుప్రభాత సమయంలో
సోమవారం వేకువజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఆమె వెళ్లనున్నారు. సుప్రభాత సమయంలో స్వామి వారిని దర్శించుకుంటారు. టీటీడీ అధికారులకు నిత్యాన్నదానానికి విరాళం అందిస్తారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదం స్వీకరిస్తారు.

Also Read- Manchu Lakshmi: మనోజ్‌ని చూసి మంచు లక్ష్మి భావోద్వేగం.. అసలేం అర్థం కావట్లే!

ఇక అన్నా కొణిదెల తన కుమారుడు క్షేమంగా ప్రమాదం నుండి బయటపడినందుకు స్వామివారి మొక్కులో భాగంగా తలనీలాలను సమర్పించడంపై హిందూ మతాన్ని అనుసరించే వారంతా గర్వపడుతున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని భర్త పరిరక్షిస్తుంటే, అన్యమతం నుంచి వచ్చి హిందూ మతాన్ని ఇంతలా గౌరవిస్తున్న మీ మనస్తత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి అంటూ చేస్తున్న కామెంట్స్‌తో అన్నా పేరు వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే..

సింగపూర్‌లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్, అక్కడ తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మంది గాయాల పాలయ్యారు. చిన్నారి మార్క్ శంకర్‌కి కూడా చేతులు, కాళ్లపైన గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగ పీల్చడంతో ఊపిరితిత్తులతోకి పొగ చేరినట్టుగా కూడా డాక్టర్లు తెలిపారు. సంఘటన జరిగిన రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. రెండు రోజుల అనంతరం మార్క్ శంకర్‌ని తీసుకుని వారు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ క్షేమంగా తిరిగి వచ్చినందుకు తిరుమల వేంకటేశ్వరునికి అన్నా తన తలనీలాలను సమర్పించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..