Tribanadhari Barbarik: సత్యరాజ్‌కు నమ్మకం పెరిగింది.. అందుకే ఆ రీల్స్!
Tribanadhari Barbarik Movie Still
ఎంటర్‌టైన్‌మెంట్

Tribanadhari Barbarik: సత్యరాజ్‌కు నమ్మకం పెరిగింది.. అందుకే ఆ రీల్స్!

Tribanadhari Barbarik: సత్యరాజ్ (Sathyaraj).. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’ (Bahubali) సినిమాతో టాలీవుడ్‌లోనే కాకుండా నేషనల్ వైడ్‌గా ‘కట్టప్ప’ (Kattappa) పాత్రలో సత్యరాజ్ గుర్తింపును పొందారు. సౌత్‌లో సత్యరాజ్ హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికే వందల చిత్రాల్లో నటించారు. ‘బాహుబలి’ తర్వాత ఆయన రేంజ్ మారింది. అప్పటి నుంచి సత్యరాజ్ చేతి నిండా ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు సైతం పోటీ అనేట్టుగా దూసుకెళుతున్నారు. సినిమాల్లో నటించడమే కాదు, ఆ సినిమాలను ప్రమోట్ చేయడంలోనూ అందరితో పోటీ పడుతున్నారు సత్యరాజ్. ఇప్పుడలానే ఓ చిత్రం కోసం ఆయన మనసు పెట్టి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Manchu Lakshmi: మనోజ్‌ని చూసి మంచు లక్ష్మి భావోద్వేగం.. అసలేం అర్థం కావట్లే!

సత్యరాజ్ ప్రముఖ పాత్రలో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. స్టార్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ అలరించడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. పాటలు, టీజర్, గ్లింప్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌లో సినిమా పట్ల ఆసక్తిని పెంచుతూ వస్తుంది. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రెండ్‌ను ఫాలో అయ్యారు సత్యరాజ్.

‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్‌ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడొస్తున్న సినిమాల మేకర్స్ ప్రత్యేకంగా వాటిపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ‘త్రిబాణధారి బార్బరిక్’ నుంచి రీసెంట్‌గా విడుదలైన ‘అనగా అనగా కథలా’ అనే పాట యూట్యూబ్‌లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాత, మనవరాలి మధ్య ఉండే బాండింగ్‌ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట ప్రమోషన్స్‌లో ప్రత్యేకంగా సత్యరాజ్ పాల్గొనడం విశేషం.

Also Read- Samantha : ఆ పని చేసి కోట్లలో న‌ష్ట‌పోయానంటూ సంచలన కామెంట్స్‌ చేసిన స‌మంత

ఈ పాటపై ఆయన రీల్స్ చేస్తూ, ఆ రీల్స్‌లో డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో హీరోయిన్లంతా కూడా రీల్స్ చేస్తుండగా.. సత్యరాజ్ సైతం ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఈ సినిమాపై ఆయనకు ఉన్న నమ్మకమే ఇలా ప్రత్యేకంగా ప్రమోషన్స్‌లో పాల్గొనేలా చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అందుకే ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నారని అంటున్నారు. సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..