Manchu Lakshmi Gets Emotional
ఎంటర్‌టైన్మెంట్

Manchu Lakshmi: మనోజ్‌ని చూసి మంచు లక్ష్మి భావోద్వేగం.. అసలేం అర్థం కావట్లే!

Manchu Lakshmi: మంచు ఫ్యామిలీ (Manchu Family)లో అసలేం జరుగుతుందో ఎవరకీ అర్థం కావడం లేదు. ఎందుకంటే, ఒక తల్లికి పుట్టిన బిడ్డలు మంచు విష్ణు, మంచు లక్ష్మీ. కానీ మరో తల్లికి పుట్టిన మంచు మనోజ్‌ (Manchu Manoj) కి మంచు లక్ష్మీ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. మంచు మనోజ్‌ రెండో పెళ్లిని మంచు లక్ష్మి దగ్గరుండి మరీ చేయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ఇంటిలో జరుగుతున్న గొడవలని తట్టుకోలేక, మంచు లక్ష్మి ముంబైకి తన మకాంని మార్చేసింది. ఈ విషయం స్వయంగా ఆమెనే చెప్పింది. మంచు లక్ష్మీ ఇన్వాల్వ్ అయిన ప్రతిసారి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ అస్సలు అర్థం కాని విధంగా మారిపోతుంది.

Also Read- SSMB29: ‘బాహుబలి’ తర్వాత మరోసారి రాజమౌళికి ఆ దర్శకుడి సాయం!

ఎందుకంటే, మంచు మనోజ్ మా మధ్య జరుగుతుంది ఆస్తుల గొడవలు కాదని అంటున్నాడు. కానీ జల్ పల్లి‌లో తను ఉంటున్న నివాసం విషయంలో రకరకాలుగా వార్తలు ఎప్పటికప్పుడూ కొత్తకొత్తగా వినబడుతూనే ఉంటున్నాయి. రీసెంట్‌గా సౌందర్య మరణం వెనుక కూడా ఓ రీజన్ ఉన్నట్లుగా ఓ వార్త వైరల్ అయింది. ఆ తర్వాత సౌందర్య భర్త క్లారిటీ ఇవ్వడంతో ఆ విషయం కాస్త సద్దుమణిగింది. ఇప్పుడేమో ఆ ఇంట్లోకి తనని రానివ్వకుండా మంచు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నాడని, మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. రీసెంట్‌గా ఆయన ధీనంగా గేటు ముందు కూర్చుని ఉన్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే.

">

ఈ నేపథ్యంలో అసలు ఎవరిది ప్రాబ్లమ్ అనేది అంతుపట్టకుండా మారింది. కాసేపు మంచు మనోజే వారిని విసిగిస్తున్నాడనిపిస్తూ ఉంటుంది. ఇంకోసారి మంచు మనోజ్‌కి వారు అన్యాయం చేస్తున్నారని అని అనిపిస్తుంది. మొత్తంగా అయితే, ఒకవైపు పరువు పోతున్నా కూడా ఈ సమస్యని వారు పరిష్కరించుకోలేకపోతున్నారు. తన తండ్రి, తల్లి మీద ఒక్క మాట కూడా మనోజ్ తూలడం లేదు. కేవలం మంచు విష్ణు, తన అనుచరగణంతో మాత్రమే వైరానికి దిగుతున్నాడు. మోహన్ బాబు మాత్రం మంచు మనోజ్‌పై సీరియస్ అవుతూ లేఖలు విడుదల చేస్తూ, మంచు విష్ణుని వెనకేసుకొస్తున్నాడు. ఈ క్రమంలో మంచు లక్ష్మి ఎటు నిలబడుతుందనే దానిపైనే, వీరి గొడవపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read- Arjun Son Of Vyjayanthi: అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్

ఆ క్లారిటీ కూడా వచ్చేసింది. తాజాగా ‘టీచ్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమం నిమిత్తం మంచు లక్ష్మి హైదరాబాద్ రాగా, అదే కార్యక్రమానికి మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి హాజరయ్యాడు. మంచు మనోజ్‌ని చూసి ఒక్కసారిగా మంచు లక్ష్మి భావోద్వేగానికి గురైంది. మంచు మనోజ్‌ని హత్తుకుని, కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. మౌనికని, మంచు మనోజ్‌ని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది. మంచు లక్ష్మి కూడా మంచు మనోజ్‌కే సపోర్ట్ చేస్తుంది అంటే, మంచు ఫ్యామిలీలో ముసలానికి కారణం మంచు విష్ణునే అనేలా ఇప్పుడు టాక్ మొదలైంది. అలా అనుకుంటే, మోహన్ బాబు (Manchu Mohan Babu) సపోర్ట్ విష్ణుకే ఉంది కదా.. అనే వారు లేకపోలేదు. ఎలా చూసినా, వారి ఫ్యామిలీ గొడవకు అసలు కారణం ఏమిటనేది మాత్రం అస్సలు తెలియడం లేదు. మరి ఈ వివాదం విషయంలో ఇంకా ఎన్ని చూడాలో, ఎప్పటికి ముగుస్తుందో చూడాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు