Salvo Explosives Company Encroaches on Government Land
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Salvo Explosives: సాల్వో సంగతేంటి? హెచ్‌సీయూ వివాదం నేపథ్యంలో హాట్ టాపిక్

– కీసర గుట్టల్లో గుట్టుగా సాగుతున్న వ్యవహారం
– 200 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పేలుడు పదార్ధాల కంపెనీ
– కన్జర్వేషన్ జోన్‌లో అక్రమ మైనింగ్.. అనుమతుల్లేకుండానే భారీ ఫ్యాక్టరీ?
– అధికారంలో ఎవరుంటే వారితో దోస్తీ.. మచ్చిక చేసుకోవడంలో మేటి జయరాం రెడ్డి
– కోర్టులో కేసులు వేసిన వారికి తాయిలాలు.. అసైన్డ్‌దారులకు చుక్కలు
– విషయాలన్నీ దాచిపెట్టి మరిన్ని అనుమతులకు దరఖాస్తు
– తూతూమంత్రంగా మేడ్చల్, యాదాద్రి జిల్లాల కలెక్టర్ల చర్యలు
– హెచ్‌సీయూ సంగతి సరే.. సాల్వో సంగతి తేల్చుతారా?


స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం:

HCU Land Issue: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం తర్వాత ప్రభుత్వ ల్యాండ్స్‌పై అందరి దృష్టి పడింది. ప్రతిపక్షాలు అదే పనిగా భూములను భవిష్యత్ తరాల కోసం కాపాడాలంటూ తెగ మాట్లాడుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ పరిధిలో 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎక్స్‌ప్లోజివ్ కంపెనీని నడిపిస్తున్న సాల్వో సంస్థపై విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని పార్టీలకు, నేతలకు డబ్బులు పడేస్తే కుక్కిన పేనులా పడి ఉంటారనే భావనలో సదరు కంపెనీ తీరు ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో కన్జర్వేషన్ జోన్‌గా కనిపిస్తున్నా, అక్కడ వేల చేట్లను నరికి 100 ఏకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే బాంబుల కంపెనీ నడిపిస్తున్నారు. గుట్టలను తొలగిస్తూ అక్రమ క్రషర్ యూనిట్స్ వెలిశాయి. ఓఆర్ఆర్‌కు కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ దందాను ఎందుకు పట్టించుకోవడం లేదని ఇప్పుడు పర్యావరణ వేత్తలు ప్రశ్నిస్తున్నారు.


సాల్వో జయరాం రెడ్డి ధీమా ఏంటి?

ప్రభుత్వ ఏజెన్సీలను మోసం చేస్తూ పేలుడు పదార్ధాల లైసెన్స్‌లను పొందిన సాల్వో ఎక్స్‌ప్లోసివ్స్ అధినేత జయరాం రెడ్డి, నేతలకు కోట్లాది రూపాయలు పెట్టుబడి ఇచ్చి, చట్టాలను పట్టించుకోవడం లేదు. తన కంపెనీ పెద్ద పెద్ద సంస్థలకు పేలుడు పదార్ధాలు సప్లై చేస్తున్నది. 40 వేల టన్నుల పేలుడు పదార్ధాలను సప్లై చేసేలా అనుమతులు ఇవ్వాలంటూ 6 నెలల క్రితం మళ్లీ పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ను అనుమతి కూడా కోరింది. డబ్బులు పడేస్తే ఎలాంటి అనుమతులైనా వస్తాయన్న ధోరణలో సాల్వో కంపెనీ వ్యవహరిస్తున్నది. ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతి కోసం సాల్వో చెప్పి భూ వివరాలు స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం చేతికి చిక్కాయి. జయరాం రెడ్డికి ఉన్న భూమి ఏంత? అసైన్డ్ భూమి లెక్కలేంటి? ప్రభుత్వ భూముల్లో కంపెనీ ఎలా నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నో విషయాలు తెలిశాయి. సామర్ధ్యం పెంచుకునేందుకు సాల్వో కంపెనీ 378 ఎకరాల వివరాలతో అప్లై చేసుకుంది.

మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ పరిధిలోని అంకిరెడ్డిపల్లికి చెందిన భూమిలో తనకు టైటిల్ ఉందని సాల్వో చెప్పుకుంటున్న భూ వివరాలు

1. సర్వే నెంబర్లు: 916, 917, 918, 756, 762, 765
– విస్తీర్ణం: 43 ఎకరాల 14 గుంటలు
– భూమి రకం: అసైన్డ్ ల్యాండ్

2. సర్వే నెంబర్లు: 757, 758, 760
– విస్తీర్ణం: 9 ఎకరాల 34 గుంటలు
– భూమి రకం: పట్టా ల్యాండ్

3. సర్వే నెంబర్: 761
– విస్తీర్ణం: 19 ఎకరాల 39 గుంటలు
– భూమి రకం: పట్టా ల్యాండ్

4. సర్వే నెంబర్లు: 759, 763
– విస్తీర్ణం: 2 ఎకరాల 4 గుంటలు
– భూమి రకం: పట్టా ల్యాండ్ (ఎటువంటి సమస్యలు లేవు)

5. సర్వే నెంబర్లు: 764, 767, 768
– విస్తీర్ణం: 11 ఎకరాల 4 గుంటలు
– భూమి రకం: అసైన్డ్ ల్యాండ్ (7 ఎకరాల 30 గుంటలు), మిగిలినది పట్టా

6. సర్వే నెంబర్: 754
– విస్తీర్ణం: 19 ఎకరాల 10 గుంటలు
– భూమి రకం: చెరువు (6 ఎకరాల 9 గుంటలు), అసైన్డ్ ల్యాండ్ (10 ఎకరాల 33 గుంటలు), మిగిలినది (2 ఎకరాల 8 గుంటలు)

7. సర్వే నెంబర్: 905
– విస్తీర్ణం: 24 గుంటలు
– భూమి రకం: అసైన్డ్ ల్యాండ్

8. సర్వే నెంబర్: 906
– విస్తీర్ణం: 6 గుంటలు
– భూమి రకం: పట్టా ల్యాండ్ (ఎటువంటి సమస్యలు లేవు)

9. సర్వే నెంబర్: 907
– విస్తీర్ణం: 2 ఎకరాల 5 గుంటలు
– భూమి రకం: అసైన్డ్ ల్యాండ్

10. సర్వే నెంబర్: 908
– విస్తీర్ణం: ఎకరం 8 గుంటలు
– భూమి రకం: అసైన్డ్ ల్యాండ్

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం రామలింగంపల్లి గ్రామం సర్వే నెంబర్స్ వివరాలు

1. సర్వే నెంబర్లు: 208, 312
– విస్తీర్ణం: 279 ఎకరాల 18 గుంటలు
– భూమి రకం: పోరంబోక్ ల్యాండ్
– వివరాలు: మొత్తం భూమి ప్రభుత్వ భూమి

పట్టా భూమిలో లేని ఫ్యాక్టరీ

మొత్తం 378 ఎకరాల భూమిలో 22 ఎకరాలు మాత్రమే పట్టా భూమి. ఆ భూముల్లో జయరాం రెడ్డి ఫ్యాక్టరీ లేదు. జిల్లా సరిహద్దు వివాదంతో అసైన్డ్ చేసిన భూముల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసైన్డ్ ల్యాండ్స్‌ను అసైన్డ్‌దారులు అమ్ముకుంటే ప్రభుత్వం పీఓటీ యాక్ట్ 1977 ప్రకారం స్వాధీనం చేసుకోవాలి. కానీ, గుట్టల్లో పర్యావరణాన్ని పాడు చేస్తూ ఇష్టారాజ్యంగా పనులు కొనసాగిస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని పర్యావరణ వేత్తలు కోరుకుంటున్నారు. పక‌ృతిని విధ్వంసం చేసినందుకు కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?