PuriSethupathi: డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh) కు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. అందుకోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఆయన కెరీర్ కాస్త గాడిలో పడిందనే అనుకునే లోపే ‘లైగర్’ (Liger) రూపంలో భారీ డిజాస్టర్ ఆయన చెంతకు చేరింది. ఆ తర్వాత చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో పూరీతో సినిమా చేసేందుకు తెలుగు హీరోలు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తనేంటో నిరూపించుకునేందుకు విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)తో ప్రాజెక్ట్ ఓకే చేయించాడు.
Also Read- Kavya Thapar: కావ్య థాపర్ గ్లామర్ ట్రీట్‌కు వచ్చిందో ఛాన్స్!
అది కూడా నార్మల్ ప్రాజెక్ట్ కాదు.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను రూపొందించబోతున్నాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను పూరీ, ఛార్మీ కౌర్ (Charmme Kaur) ప్రకటించిన విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్‌లోనే ఈ సినిమా గ్రాండ్‌గా నిర్మాణం జరుపుకోబోతుంది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ కోసం పూరి జగన్నాధ్ ఓ పవర్ ఫుల్ కథని రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారనేలా టాక్ వినబడుతుంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే ఇతర తారాగణంపై పూరి, ఛార్మీ కౌర్ దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఓ స్టార్ నటిని ఆల్రెడీ సెలక్ట్ చేసినట్లుగా తెలుపుతూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
She’s electric.
She’s explosive .
She’s THE TABU.Proudly welcoming THE GEM OF INDIAN CINEMA, Actress #Tabu on-board for a ROLE as DYNAMIC as her presence in #PuriSethupathi ❤️🔥
A #PuriJagannadh Film
Starring Makkalselvan @VijaySethuOfflProduced by Puri Jagannadh,… pic.twitter.com/WGp0kkuZDl
— Puri Connects (@PuriConnects) April 10, 2025
ఆ స్టార్ నటి ఎవరో కాదు.. ఈ ప్రాజెక్ట్‌పై అందరికీ ఎగ్జయింట్‌మెంట్ పెంచేలా, సీనియర్ నటి టబు ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. టబు ఈ మధ్యకాలంలో ఎలాంటి పాత్రలలో నటిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలెక్టెడ్ రోల్స్‌కి పాపులరైన టబు (Tabu).. దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన కథ, అందులో తన పాత్ర, కథాంశం నచ్చడంతో వెంటనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో చేయడానికి ఓకే చెప్పిందనేలా టీమ్ వెల్లడించింది. విజయ్ సేతుపతి, టబు.. వింటుంటేనే పూరీ ఈ సినిమాతో ఏదో చేయబోతున్నాడనేది అర్థమవుతుంది.
Also Read- Chhaava OTT: ‘ఛావా’ ఓటీటీ డేట్ ఫిక్సయింది.. ఇంకొన్ని గంటల్లోనే!
వాస్తవానికి పూరీకి వరుస ప్లాప్స్ వచ్చినా, నిలబడడానికి ఒక్క హిట్ చాలు. ఆ హిట్‌ని ఎలా కొట్టాలో కూడా పూరీకి తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆయన రైటింగ్‌కి, డైలాగ్స్‌కి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. కొన్నాళ్లుగా వాళ్లు డిజప్పాయింట్‌లో ఉన్నారు. అలాంటి వారందరికీ ఈసారి ఫుల్ మీల్స్ పెట్టే పనిలో పూరీ ఉన్నాడని టీమ్ నుంచి లీక్స్ వస్తున్నాయి. ఈ సినిమా జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు