Janasena on Kavitha (Image Source: Twitter)
తెలంగాణ

Janasena on Kavitha: పవన్ తో పెట్టుకున్న కవిత.. ఏకిపారేస్తున్న జనసైనికులు.. మరీ ఇంత ఘోరంగానా!

Janasena on Kavitha: బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుమార్తె కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)కు రాజకీయంగా ఊహించని తలనొప్పులు మెుదలయ్యాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalynan) పై కవిత చేసిన తాజా కామెంట్స్ పై జనసేన నేతలు, కార్యకర్తలు ఊగిపోతున్నారు. ఆమెపై నెట్టింట విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే పవన్ ను ఆమె టార్గెట్ చేశారని జన సైనికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ జనసేన పార్టీ ఇంఛార్జ్.. కవితపై ఘాటు విమర్శలు చేశారు.

కవితకు స్ట్రాంగ్ కౌంటర్
పవన్ పై కవిత చేసిన విమర్శలపై తెలంగాణ జనసేన పార్టీ ఇంఛార్జ్ నేమురి శంకర్ గౌడ్ (Nemuri Shankar Goud) స్పందించారు. లిక్కర్ స్కామ్ తో తిహార్ జైలుకు వెళ్లిన ఆమె.. పవన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పదేళ్లు కష్టపడి తిరిగి.. ప్రజల్లో ప్రేమానురాగాలను పవన్ సంపాదించారని గుర్తుచేశారు. అంతేగానీ కవిత లాగా పవన్ ఏనాడూ నామినేట్ పోస్ట్ తీసుకోలేదని చురకలు అంటించారు. పవన్ గురించి మాట్లాడటం.. తిరిగి జనాల్లో ఫోకస్ గా మారడం ఇటీవల చాలా మందికి అలవాటుగా మారిపోయిందని అన్నారు. ఇంకోసారి ఎవరైనా తమ అధినేత గురించి తప్పుగా మాట్లాడితే తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

జనసేన సెటైర్లు
పవన్ సీరియస్ పొలిటిషియన్ కాదంటూ కవిత చేసిన కామెంట్స్ పై జనసేన శ్రేణులు (Janasena Cadre) తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. అలా అనిపించుకోవాలంటే నీలాగా స్కామ్స్ చేయాలా అంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లినా మార్పు రాలేదా అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. గతంలో వైసీపీ గెలుపునకు బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో కష్టపడిందో అందరికీ తెలుసునని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎవరు పట్టించుకోవడం లేదన్న భావనలో కవిత ఉందని.. అందుకే పవన్ పై విమర్శలు చేయడం ద్వారా అయిన వార్తల్లో నిలవాలని కవిత ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.

Also Read: CM Revanth Reddy: నా బ్రాండ్ నాదే.. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

ఇంతకీ కవిత ఏమన్నారంటే?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కవితకు పవన్ గురించి ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. “అన్ ఫార్చునేట్లి హి బికేమ్ ఎ డిప్యూటీ సీఎం. హి ఈజ్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్’ అంటూ కవిత మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనసేన ఫ్యాన్స్ కవితను తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. పవన్ ను అర్హత ఆమెకు లేదని మండిపడుతున్నారు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది