మహబూబాబాద్ స్వేచ్ఛ: Mahabubabad news: తీసుకున్న అప్పు కట్టలేదని కళ్ళంలో ఉన్న రైతు మిర్చి బస్తాలను ఫెర్టిలైజర్ యజమాని లాక్కున్న ఘటన వాజేడు మండలం ధర్మారం గ్రామంలో వెలుగు చూసింది. ఫర్టిలైజర్ షాపు తీరుకు మానసికంగా కృంగిపోయిన యువ రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన బొగట నరసింహారావు అనే యువ మిర్చి రైతు రెండు ఎకరాలలో మిర్చి సాగు చేశాడు.
ఇందుకు గాను అదే గ్రామానికి చెందిన బుల్లె ప్రశాంత్ అనే ఫర్టిలైజర్ యజమాని వద్ద రూ.60,000 పురుగు మందులు మిర్చి తోటకు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు 60 వేలకు బదులు 90000 చెల్లించాలంటూ కళ్ళంలో మిర్చి బస్తాలు తొక్కుతున్న సమయంలో ట్రాక్టర్ తీసుకువెళ్లి 21 బస్తాల్లో తొక్కిన మిర్చినీ బలవంతంగా తీసుకు వెళ్ళేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రైతు అడ్డుకొని అప్పు కింద 15 బస్తాలు ఇస్తాను.
Also Read: Flats To Farmers In AP: ఆ రైతులకు గుడ్ న్యూస్.. ఈ-లాటరీ ద్వారా ఎంపిక!
మిగతావి మరుసటి ఏడాది ఇస్తాను అన్న వినకుండా మిర్చి బస్తాలు తీసుకు వెళ్లడంతో మనస్థాపానికి గురైన రైతు ఇంటికి వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు నరసింహారావును హుటాహుటిన ఏటూరు నాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా ఆరుగాలం కష్టించి పండించిన రైతుకు ఈ ఏడాది మిర్చికి గిట్టుబాటు ధర లేకపోగా, పంట సైతం అంతంత మాత్రంగానే దిగుబడి రావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు కష్టాన్ని గమనించని ఫర్టిలైజర్ యజమానులు వడ్డీ వ్యాపారస్తులు రైతు కష్టాన్ని కళ్ళంలోనే దోచుకుంటుంటే అడిగే నాధుడే లేడని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/