Mahabubabad (imagecredi:AI)
తెలంగాణ

Mahabubabad: మానుకోటలో నయా దందా.. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు.. అధికారుల అండదండలతో!

మహబూబాబాద్ స్వేచ్ఛ: Mahabubabad: మానుకోటలో నయా దందాకు అక్రమార్కులు తెర లేపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం నలుమూలల విస్తృతమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. కొంతమంది పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకుల కన్ను ఆ ప్రభుత్వ భూముల పై పడింది. మహబూబాబాద్ జిల్లా సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లా నర్సంపేట, సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వివిధ రకాల ప్రజలను తీసుకొచ్చి ప్రభుత్వ భూములు గుడిసెలు వేసి బోర్డులను పెడుతున్నారు.

ఈ అక్రమ దందాకు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యధికంగా చోటు చేసుకోవడం గమనార్హం. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, కెసిఆర్, ఇతర పేర్లతో కాలనీలు పదుల సంఖ్యలో వెలిశాయి. అప్పటి ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు కోసం గుడిసె వాసుల్ని దగ్గర చేసుకుని వారికి వాగ్దానాలను ఇవ్వడం ప్రారంభించారు. అదే వరవడి నేటి వరకు కొనసాగుతూనే ఉంది.

ప్రజా ప్రతినిధుల వాగ్దానాలు అధికారుల అండదండలు

ఓవైపు ప్రజా ప్రతినిధుల వాగ్దానాలు మరోవైపు అధికారుల అండదండలు ఉండడంతో అక్రమార్కుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. వివిధ జిల్లాలకు చెందిన ఆధార్ కార్డు అడ్రస్ లేని నిరుపేదలను గుడిసెలు ఇస్తామంటూ మభ్యపెట్టి వారిని తీసుకొచ్చి గుడిసెలు వేయించడం ఆనవాయితీగా సాగుతోంది. ప్రభుత్వ భూముల్లో నిజంగా వేసుకోవాల్సింది జిల్లాకు చెందిన నిరుపేద ప్రజలు మాత్రమే. అది పార్టీలకు గాని సంఘాలకు గాని సంబంధం లేకుండా చేసుకునే ప్రక్రియ.

Also Read: Nalgonda Gas Dealers: గ్యాస్ టైంకి రాక విసిగి పోతున్నారా అయితే.. ఇది మీకోసమే!

అయితే ఇక్కడ కొంతమంది అక్రమార్కులు అక్రమ ఆదాయం కోసం నిరుపేదల కోసం గుడిసెలంటూ ప్రకటనలు చేసి వారికి మాయమాటలు చెప్పి గుడిసెలు వేయిస్తున్నారు. ఇలా గుడిసెలు వేసిన వారి వద్ద నుంచి ప్రారంభ దశలో ఒక్కొక్క గుడిసె వాసుల నుండి రూ.5వేల నుంచి రూ. 50వేల వరకు వసూలు చేస్తున్నట్లు గుడిసె వాసులు గగ్గోలు పెడుతున్నారు.

ఈ అక్రమ వస్తువులలో కొంత అధికారులకు, కొంత పెద్ద మొత్తంలో ప్రజా ప్రతినిధులకు, గుడిసెలు వేయించిన నాయకులకు మరికొంత నగదు ముడుతోందని గుడిష వాసులు ద్వారా అని తెలుస్తుంది. ఈ తంతు అంతా ముగిశాక డోర్ నెంబర్ ల కోసం అంటూ మరికొంత నగదును వసూలు చేసి సంబంధిత అధికారులకు ముట్ట చెబుతున్నట్లు సమాచారం.

అంతా అయిపోయింది ఒక్కొక్కరీ వద్ద నుంచి రూ.2 లక్షలు వసూళ్ళు

జిల్లాకు సంబంధం లేని నిరుపేద కుటుంబాలు జీవనోపాధి కోసం వస్తే వారిని గుడిసెలు అనే పేరు చెప్పి గుడిసెలు వేయించి, దపదపాలుగా డబ్బులు వసూలు చేయడం కానించి మొదలు పెడితే డోర్ నెంబర్లు వచ్చేంతవరకు వివిధ సాకులు చెబుతూ వసూలు చేస్తూనే ఉంటారని తెలుస్తుంది. అంతా అయిపోయింది ఇక డోర్ నెంబర్లు వస్తున్నాయి. ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది తయారు చేసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

కొన్ని కాలనీలో గత ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు నిరుపేదలు. పొద్దంతా కూలికి పోయి సాయంత్రం వచ్చేసరికి గుడిసెలు వేయించిన నాయకులు వారి వద్ద నుంచి ఏదో రకంగా డబ్బులు వసూలు చేయడం అలవాటుగా చేసుకున్నారు.

ఏదో కారణం వల్ల వారం 15 రోజులు గుడిసెలకు దూరంగా ఉంటే వారికి గుడిసెల్లో ఉండేందుకు అర్హత లేదని వార్నింగ్ లు ఇస్తూ వారికి గుడిసెలు లేకుండా చేస్తున్నట్లు తెలిసింది. వారి స్థానంలో ఇంకొకరికి అవకాశం కల్పించి వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం ఆ అక్రమార్కులకు ఆనవాయితీగా వస్తున్నట్లు సమాచారం ద్వారా తెలుస్తోంది.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు