New Liquor Brands: తెలంగాణలోని మందు బాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్. త్వరలోనే కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 371 రకాల ఇండియన్ మేడ్, 273 రకాల ఫారిన్ మేడ్ లిక్కర్ బ్రాండ్లు ఉండనున్నట్టు ఎక్సయిజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. కొత్తగా మార్కెట్లోకి రానున్న వీటిలో 386 బ్రాండ్ల మద్యం విక్రయించటానికి 47 కొత్త కంపెనీలు దరఖాస్తు చేసినట్టుగా పేర్కొన్నారు. మరో 218 బ్రాండ్ల మద్యం అమ్మకాలకు 45 పాత కంపెనీలు అప్లయ్ చేసుకున్నట్టు తెలిపారు.
Also Read: Pawan Kalyan: కొడుకు ప్రమాదంపై.. పవన్ ఫస్ట్ రియాక్షన్.. వారే లేకుంటే?
కొత్త బ్రాండ్ల మద్యం అమ్మకాలు చేయాలనుకునే కంపెనీలు దరఖాస్తులు చేసుకోవాలంటూ ఫిబ్రవరి 23న ఎక్సయిజ్ శాఖ నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీంట్లో మార్చి 15వ తేదీని చివరి గడువుగా పేర్కొన్నారు. కాగా, టీజీబీసీఎల్ (TGBCL) కొత్త నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించ లేకపోతున్నామని తెలిపిన ఆయా కంపెనీల ప్రతినిధులు మరికొంత గడువు అడిగారు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ వరకు గడువును పొడిగించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఆమోదం మేరకు కొత్త బ్రాండ్ల విక్రయాలకు అనుమతులు ఇవ్వనున్నట్టు ఎక్సయిజ్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు.