తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Gurukulas: గురుకులాల్లో కోడింగ్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్స్ కార్యదర్శి అలుగు వర్షిణి పేర్కొన్నారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో 2025 -26 అకడమిక్ నుండి పూర్తి స్థాయిలో కోడింగ్ కోర్సులు అందుబాటులోకి వస్తాయని ఆమె వివరించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కోడింగ్ కోర్సుల కోసం ఐదేళ్ల పాటు విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్ ను అందించేందుకు ఆ ర్ ఫీఎఫ్, యూకే ఫౌండేషన్ తో ఎంఓయూ చేశామని వివరించారు.
ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు కోడింగ్ పై శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థుల అభిరుచులు, ఆశయాలు ఆధారంగా ఈ ట్రైనింగ్ నిర్వహిస్తామన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో 238 పాఠశాలల్లో కోడింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది కేవలం ఒక్క మొయినాబాద్ పాఠశాల మాత్రమే ఉన్నదని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు విస్తరింపచేయాలని సంకల్పించినట్లు వెల్లడించారు. లండన్ కు చెందిన సంస్థ విద్యార్ధుల కరిక్యులమ్, యాక్షన్ ప్లాన్, మానిటరింగ్, పెడగోజీ వంటి అంశాలపై తమతో డిస్కషన్ చేస్తుందన్నారు.
ఏఐ, కోడింగ్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆన్ లైన్ టూల్స్ సంబంధించిన సిలబస్ ను నేర్పించేందుకు ప్రిపరేషన్ జరుగుతుందన్నారు. అన్ని పాఠశాలలోని దాదాపు లక్షా 52 వేల మందికి కంప్యూటింగ్ పై ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది దాదాపు 250 మంది విద్యార్ధులు ఒక లైవ్ ప్రాజెక్టులో పనిచేసే అవకాశాన్ని పొందుతారని వివరించారు.
ఈ మేరకు కంప్యూటర్ ల్యాబరేటీస్ ను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.ఈ కోడింగ్ ద్వారా అప్లికేషన్లు, వెబ్‌సైట్లు, సాఫ్ట్‌వేర్లు రూపొందించవచ్చన్నవారు. పైథాన్ , స్క్రాచ్, జావా, హెచ్‌టీఎంఎల్, ఇలా తదితర చాలా కంప్యూటర్ ప్రొగ్రామింగ్ భాషలు ఉంటాయని వెల్లడించారు.
Also Read: Akhil6: మా నాయన నాకో మాట చెప్పినాడు.. అఖిల్ ఈసారి మాస్ అవతార్‌లో!