Complaints on Rajini: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత విడదల రజినీపై వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం చిలకలూరిపేటలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌లో పసుమర్రు రైతులు రజినీపై రెండు ఫిర్యాదులు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రజినీ మామ లక్ష్మీ నారాయణ పసుమర్రులో రోడ్డును ఆక్రమించుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు.
ఆక్రమించుకున్న స్థలానికి గోడకట్టారని, అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆ స్థలాన్ని పసుమర్తి పంచాయతీకి లక్ష్మీ నారాయణ రాసిచ్చారని వివరించారు. పంచాయతీకి రాసిచ్చిన స్థలంపై లక్ష్మీ నారాయణ కొడుకు రాము కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని రైతులు పేర్కొన్నారు.
ఇక, పసుమర్రులో జగనన్న కాలనీ కోసం ప్రభుత్వం 200 ఎకరాలు పొలం కొనుగోలు చేసిందని, భూములు ఇచ్చిన రైతుల నుంచి లంచం తీసుకున్నారని పేర్కొన్నారు. లంచం తీసుకున్న డబ్బులో కొంతమేర తిరిగిచ్చారని, ఇంకా నలభై లక్షలు ఇవ్వాల్సి ఉందని పసుమర్రు రైతులు వాపోయారు. విడుదల రజినీ, ఆమె లక్ష్మీనారాయణ, మరిది రాము పేర్లను రైతులు ఫిర్యాదు చేర్చారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు