Telangana (Image Source : Twitter)
తెలంగాణ

Telangana: పులుల కోసం వచ్చిన తిప్పలు.. అధికారుల ప్లాన్ ఏమిటంటే?

Telangana: పులుల ఆహారం కోసం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జింకలను పెంచితే పులులు గ్రామాల్లోకి రాకుండా ప్రజలపై దాడి చేయకుండి నివారించవచ్చని భావిస్తున్నారు. దీంతో ప్రత్యేక దృష్టిసారించి నాలుగు ప్రాంతాల్లో జింకల పునరుత్పత్తి చేస్తున్నారు. వాటిని అడవుల్లో వదిలిపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. పులులకు ఆహారం లభిస్తే ఇతర ప్రాంతాలకు సైతం వెళ్లకుండా రాష్ట్రంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయని, అందుకోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ తో పాటు ఇకో బ్రిడ్జులను సైతం ఫారెస్టులో నిర్మాణం చేపడుతున్నారు.

రాష్ట్రంలో పులుల దాడులు పెరుగుతున్నాయి. ఫారెస్టులో వాటికి ఆహారం లభించని సమయంలో పశువులపై దాడులు, మరోవైపు తోడు దొరకనప్పుడు సంచార సమయంలో ఎదురుపడిన ప్రజలపై దాడులు చేస్తున్నాయి. కాగజ్ నగర్, పెంచికల్ పేట రేంజ్, కొమురంబీం జిల్లా వాంకిడి, కొండలింగాల వలస పంచాయతీ, కోస్టారా శివారులో ఇలా పులులు దాడులు చేశాయి. వాటి నివారణకు ప్రభుత్వం అలర్ట్ అయ్యి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో జింకల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో జింకల పునరుత్పత్తి చేస్తున్నారు. అయితే వాటిని మరింతగా పెంచేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్కు, వనస్థలి పురంలోని మహావీర్ హరిణి, ,అమ్రాబాద్ లోని చెన్నారం, దూలపల్లిలో జింకలను పెంచున్నట్లు అధికారులు తెలిపారు. చెన్నారం పార్కులో జింకల బీడింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. 600వరకు జింకలు ఉన్నట్లు తెలిసింది. నెహ్రూ జూపార్కులో 200వరకు ఉన్నాయి. మహావీర్ హరిణి జింకల పార్కులో 400వరకు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

విడుతలవారీగా..

రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు అటవీశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. తొలుత ఏటూరు నాగారం అభయారణ్యానికి వరంగల్‌లోని కాకతీయ జూ పార్క్‌ నుంచి ఇటీవల 20 చుక్కల దుప్పులు, 13 సాంబార్‌ జింకలు(ఖనుజు), అదే విధంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌ నుంచి అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌కు 19 చుక్కల దుప్పులను తరలించారు. రెండో విడుత సుమారు 200వరకు అమ్రాబాద్ అడవుల్లో జింకలను వదిలిపెట్టినట్లు సమాచారం.

పులుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా..

రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 45కు పైగా పులులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాటి సంఖ్య పెరుగుతుండటంతో అదే స్థాయిలో జింకల పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో 600కు పైగా జింకలు పెంచుతున్నారు. వాటి ఉత్పత్తిని పెంచి పులుల సంచారం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో దాదాపు 400 చుక్కల దుప్పి, కృష్ణ జింక, మనబోతు, ఖనుజు లను జూపార్క్‌, మహావీర్‌ హరిణ వనస్థలి నుంచి రాష్ట్రంలో ఉన్న పులుల ఆవాసాలకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.

స్థిర నివాసం కోసమే ప్రత్యేక చర్యలు

పులుల స్థిరనివాసం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వాటికి కావల్సిన ఆహారం లభించే ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం జింకల సంఖ్య పెంపునకు అధికారులు కృషిచేస్తున్నారు. కవ్వాల్‌, అమ్రాబాద్‌ పులుల సంరక్షణ కేంద్రాలతో పాటు కిన్నెరసాని, ఏటూరునాగారం, పాకాల అభయారణ్యాలలో జంతు సమతుల్యత పెంచేలా ఈ తరలింపు దోహదపడుతుందన్నారు. వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 1972 ప్రకారం అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఈ తరలింపు ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ అడవుల్లో వన్యప్రాణి సంపదను మరింత పెంచేందుకు జూ పార్కుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న శాకాహార జంతువులను పులుల అభయారణ్యాలకు, రక్షిత అటవీ ప్రాంతాలకు తరలించేందుకు నిర్ణయించినట్లు అటవీశాఖ పేర్కొంది.

ప్రత్యేక రూట్ మ్యాప్

అటవీ ప్రాంతాల్లో పులుల కోసం వాకిండి దగ్గర ఇకో బ్రిడ్జి నిర్మాణం సైతం చేపడుతున్నారు. టెరిటెరి టైగర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చివెళ్తుంటాయి. అవి తెలంగాణలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేలా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. వాటికి కావల్సిన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం అటవీశాఖలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పులుల లెక్కింపు చేపట్టి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా జింకలను ఆ ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారు. జనాల్లోకి రాకుండా, పశువుల మీద దాడి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు