BRS Party(image credit:X)
తెలంగాణ

BRS Party: సిల్వర్ జూబ్లీ వేడుకలపై గులాబీ డైలమా? బీఆర్ఎస్ సభ అనుమతి వచ్చేనా?

BRS Party: బిఆర్ఎస్ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ పరిధిలోని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి లో నిర్వహించ తలపెట్టిన బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల బహిరంగ సభ నిర్వహణపై గులాబీ నేతల డైలమాలో పడ్డారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు ఇంకా పోలీసుల అనుమతి రాకపోవడమే అందుకు కారణం.

ఒక వైపు, ప్రజలు మా వెంటే ఉన్నారనే మెసేజ్ ఇచ్చేందుకు ప్లాన్ వేసిన బిఆర్ఎస్ ఈ సభను గ్రాండ్ నిర్వహించాలని బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది. అయితే సరిగ్గా ఈ నెల 6 నుంచి వచ్చే నెల 5 వరకు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 30 సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్టు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ప్రకటించారు. దీంతో సభకు వరంగల్ పోలీసులు అనుమతి ఇస్తారా…? లేదా …? అనే సందిగ్ధత నెలకొంది.ఒక వేళ వరంగల్ పోలీసులు సభ నిర్వాహకను అనుమతి ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాలని బి ఆర్ ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బిఆర్ఎస్ అధినేత
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత బిఆర్ఎస్ పార్టీ బలహీన పడింది. ఎమ్మెల్యేలు సహా నాయకులు, క్యాడర్ బిఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఈ క్రమంలో పార్టీ వెంటే క్యాడర్ ఉంది. ప్రజలు మా వైపే మళ్ళీ చూస్తున్నారని నిరూపించుకునే ఉద్దేశ్యంతో ఈ నెల 27 న నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 10 లక్షల మందిని తరలించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బిఆర్ఎస్ నేతలు ఒకవైపు చెబుతున్నారు. ఇప్పటికే బిఆర్ఆర్ అధినేత కేసీఆర్ అన్ని జిల్లాల లీడర్లతో సమీక్ష నిర్వహించారు. సభ నిర్వహణ బాధ్యతలు ముఖ్య నేతలకు అప్పగించారు. చింతలపెల్లి గ్రామ రైతులతో ఒప్పందం కుర్చుకుని బిఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించి సభ వద్ద స్టేజి ఏర్పాటు పనులు ప్రారంభించారు. ఒక వైపు సభాస్థలి వద్ద స్టేజి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. మరోవైపు నియోజక వర్గాల్లో నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే సభకు అనుమతులు రాకపోవడంతో సభ సజావుగా సాగుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది.

రాజకీయంగా కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు ప్లాన్
తొమ్మిదిన్నర సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు ప్రజాభిప్రాయాన్ని గౌరవించకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గూడుకట్టుకుని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ ఘోర పరాజయం చవిచూసింది. ఆ తరువాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లోను ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక బిఆర్ఎస్  పార్టీ కుదేలైంది. ప్రజల తీవ్రత వ్యతిరేకత తో ప్రజల్లో పార్టీ పలుచన అయ్యింది. ఈ క్రమంలో పార్టీని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేందుకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేందుకు బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను వాడుకోవాలని చూస్తుంది.

మొదటి నుంచి అనేక అడ్డంకులు
టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రయత్నాలు సాగిస్తున్న అనేక అడ్డంకులతో చివరి నిమిషంలో సభలు ఆగిపోతున్నాయి. 2023 లో గ్రేటర్ వరంగల్ పరిధిలోని హనుమకొండ జిల్లా దేవన్నపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన అప్పుడు రైతులు భూమి ఇచ్చేందుకు నిరాకరించడంతో సభ అనేకమార్లు వాయిదా పడుతూ వచ్చి చివరికి ఎన్నికల కోడ్ రావడంతో సభ నిర్వహించకుండానే హైదరాబాదులో సభ నిర్వహించుకోవలసి వచ్చింది.

సిల్వర్ జూబ్లీ సభకు సంబంధించి కూడా అనేక ఆలోచనలు చేశారు. జనగామ జిల్లా పరిధిలో స్థల పరిశీలన చేశారు. ఆ తరువాత హైదరాబాద్ పరిసరాల్లో నిర్వహించాలని అనుకుని చివరికి ఎల్కతుర్తి మండలం చింతలపల్లి అయితే భూములు అనుకూలంగా ఉండడంతో పాటు ఇటు వరంగల్ అటు సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాదు నుంచి వచ్చే వారికి అనుకూలంగా ఉంటుందని ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. సభ నిర్మాణం పనులు వేగవంతం చేస్తున్న అధికారులు పోలీస్ అనుమతి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.

అనుమతులు ఇవ్వకుంటే కోర్టుకు వెళుతాం..దాస్యం వినయ్ భాస్కర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 25 సంవత్సరాల ప్రస్తావని ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ భారీ బహిరంగ సభ నిర్వహణ అనుమతుల కోసం పోలీసులను ఆశ్రయించాం. తప్పకుండా అనుమతులు వస్తాయని నమ్మకం మాకుంది. సభ నిర్వహణ విషయంలో ఎలాంటి సందిగ్దత అవసరం లేదు. ఒకవేళ పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకు వెళ్లి అయిన అనుమతి తెచ్చుకుంటాం. కోర్టుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది.

నెల రోజుల పాటు 30 సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈనెల 6 నుంచి వచ్చే నెల 5 వరకు నెల రోజుల పాటు 30 సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలులో వుంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా మీటింగ్‌ ర్యాలీలు, ఉరేగింపులను నిర్వహించడం నిషేధించబడ్డాయి.

ఎవరైన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, అలాగే వృద్దులు, రోగులతో పాటు, విధ్యార్థుల చదువులను దృష్టిలో పెట్టుకోవడం, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డీజే సౌండ్‌లను వినియోగించడంపై నిషేధాన్ని కోనసాగించడం జరుగుతుందని. ఎవరైన తప్పని సరిగా మైక్‌లను ఏర్పాటు చేయాలనుకునేవారు తప్పని సరిగా సంబంధిత ఏసిపి అధికారుల నుండి తప్పని సరిగా అనుమతులు తీసుకోవాల్సి వుంటుందని.

మైక్‌ కేవలం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే వినియోగించుకోవాల్సి వుంటుందని. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో మైకులను వినియోగించరాదని, అలాగే హస్పటల్స్‌, విద్యాలయాలకు వంద మీటర్ల పరిధిలో మైకులను ఏర్పాటు చేయరాదని, ఈ నిషేధ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు