మంత్రులతో విస్తృత చర్చ
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదానికి సంబంధించి AICC వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan).. హైదరాబాద్ సచివాలయంలో కీలక భేటి నిర్వహించారు. భట్టి విక్రమార్క ఛాంబర్ లో జరిగిన ఈ భేటికి ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు వంశీ చంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్ సీయూ భూముల వివాదంపై లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వివాదానికి గల కారణాలను నటరాజన్ కు మంత్రులు వివరించినట్లు సమాచారం. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం వివరించినట్లు తెలుస్తోంది.
Also Read: CCTV cameras: నేరంజరిగితే తప్ప సీసీ కెమెరాలు పట్టించుకోరా.. ఎస్పీ విజయ్ కుమార్
ఏఐ టెక్నాలజీతో అసత్యాలు
మరోవైపు యూత్ కాంగ్రెస్ కార్యనిర్వహక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud).. విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. హెచ్ సీయూ భూముల వివాదంపై ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని ఫేక్ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల అవాస్తవాలను, అసత్యాలను తిప్పికొట్టాల్సిన అవసరం.. యూత్ కాంగ్రెస్ పై ఉందని టీపీసీసీ చీఫ్ అన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతీ ఒక్కరికి సముచిత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.