Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకెళుతున్న తారక్.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందిన ఈ యంగ్ టైగర్.. ప్రస్తుతం తన పరిధిని విస్తరించే పనిలో ఉన్నారు. బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ‘వార్ 2’ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో వైపు ‘దేవర 2’ సినిమాను ఆయన చేయాల్సి ఉంది. ఇంకా ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ కూడా ఆల్రెడీ పట్టాలెక్కేసింది. ఇలా చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న ఎన్టీఆర్, పబ్లిక్‌కి కనిపించి కూడా చాలా కాలమే అవుతుంది. ఎయిర్‌పోర్ట్‌లలో తప్పితే.. పబ్లిక్ ఫంక్షన్స్ వేటికీ ఈ మధ్యకాలంలో అటెండ్ కాలేదు. ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ అవడంతో ఫ్యాన్స్ బాగా ఆయనని మిస్ అవుతున్నారు. మరి ఫ్యాన్స్ కోసమో, లేదంటే తన బావమరిది కోసమే తెలియదు కానీ, తాజాగా ఆయన ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరై.. చాలా రోజుల తర్వాత పబ్లిక్‌లో దర్శనమిచ్చారు.
Also Read- Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బర్త్‌డే ట్రీట్ అదిరింది.. విజయ్ దేవరకొండే హైలెట్!
ఈ పబ్లిక్ ఫంక్షన్‌లో ఎన్టీఆర్‌ని చూసిన వారంతా షాక్ అయ్యారు. కారణం, ‘దేవర’ సినిమా టైమ్ ఎన్టీఆర్ ఫిట్‌గానే కనిపించారు. ముంబైలో ‘వార్ 2’ షూట్‌లోనూ ఆయనలో ఎటువంటి మార్పు కనిపించలేదు. మరి ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఏమైనా డౌట్ ఫాలో అవుతున్నాడో, ఏమోగానీ.. మళ్లీ ‘కంత్రీ’ రోజులను గుర్తుకు తెచ్చాడు. అవును ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్‌ని చూసిన వారంతా అనుకున్నది ఇదే. ‘యమదొంగ’, ‘కంత్రీ’ టైమ్‌లో ఎన్టీఆర్ ఎంతగా తగ్గి కనిపించారో.. సేమ్ టు సేమ్ ఇప్పుడు అలానే కనిపించడంతో అంతా షాకయ్యారు.
అసలు ఎన్టీఆర్‌కు ఏమైంది? ఇలా అయిపోయాడేంటి? అంటూ ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నీల్ సినిమా కోసమే ఇలా తగ్గుతున్నాడో, లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉందో తెలియదు కానీ, సడెన్‌గా ఎన్టీఆర్‌ని ఇలా చూసి, అంతా ఏవేవో ఊహించేసుకుంటున్నారు. మరి ఈ లుక్‌పై ఎన్టీఆర్ ఏమైనా వివరణ ఇస్తేనే, ఇలాంటి వార్తలకు బ్రేక్ పడుతుంది. లేదంటే, ప్రస్తుతం సోషల్ మీడియా పవర్ ప్రకారం మ్యాటర్ చాలా దూరం వెళ్లే అవకాశం అయితే లేకపోలేదు. చూద్దాం.. ఏమైనా అలాంటి అవకాశం ఉందేమో.
Also Read- Peddi First Shot: ఆ అనుమానాలకు చెక్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బుచ్చి!
అయితే ఎన్టీఆర్ లుక్ అలా ఉన్నప్పటికీ.. ఆయన స్పీచ్‌లోగానీ, పంచ్‌లో గానీ ఎటువంటి మార్పు లేదు. అందరినీ నవ్విస్తూ.. అత్యద్భుతంగా తన స్పీచ్‌తో తారక్ ఈ వేడుకలో అలరించాడు. మధ్య మధ్యలో ఇతర హీరోల సినిమా డైలాగ్స్ సైతం ఆయన చెప్పడం విశేషం. ప్రస్తుతం తారక్ స్పీచ్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు