Rashmika Mandanna: ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ రష్మికా మందన్నా. రీసెంట్‌గా వచ్చిన ‘సికిందర్’ కాస్త నిరాశ పరిచింది కానీ, అంతకు ముందు వరస హిట్స్‌తో ఈ నేషనల్ క్రష్ పేరు మారుమోగింది. సినిమాలతోనే కాదు, విజయ్ దేవరకొండతో డేటింగ్‌లో ఉందనే వార్తలతో కూడా రష్మిక పేరు ఎప్పుడూ టాప్‌లోనే ట్రెండ్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి విషయాలతోనే ఆమె పేరు ట్రెండ్ అయితే, ఈ బ్యూటీ బర్త్‌డే నేడు (ఏప్రిల్ 5). ఇంకెంతగా సోషల్ మీడియాని ఈ పేరు ఊపేస్తుంటుందో అర్థం చేసుకోవచ్చు.
నేషనల్ వైడ్‌గా ఆమెకు ఉదయం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఫ్యాన్స్ ఆమె ఫొటోలను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి అలాంటి జోష్‌లో ఉన్న ఫ్యాన్స్‌కి ట్రీట్ అన్నట్లుగా.. తాజాగా ఆమె నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ టీజర్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో స్పెషల్ ఏమిటంటే.. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా వాయిస్ కలపడం. అసలే వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనేలా వార్తలు వస్తుంటే, ఈ పాటలో విజయ్ చెప్పే కవిత్వం నిజంగానే వారిద్దరూ ప్రేమలో పడిపోయారనే ఫీలింగ్‌ని ఇస్తున్నాయి. ఒక్కసారి ఈ పాటను గమనిస్తే..
Also Read- Peddi First Shot: ఆ అనుమానాలకు చెక్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బుచ్చి!
‘‘నయనం నయనం కలిసే తరుణం, యదనం పరుగే పెరిగే వేగం
నా కదిలే మనసుని అడిగా సాయం, ఇక మీదట నువ్వే దానికి గమ్యం
రేయి లోలోతులా సితార.. జాబిలి జాతర
విసిరిన నవ్వుల వెలుగును చూశా.. నవ్వాపితే పగలే చీకటి తెలుసా..
నీకని మనసును రాసిచ్చేశా.. పడ్డానేమో ప్రేమలో బహుశా
కన్నులలో వెన్నెలలే కురిసే..
మది ఊసే తలవాకిట తడిసే..
ఎద జారెనే.. మనసూగెనే.. చెలి చెంతలో జగమాగెనే.. ఎద జారెనే మనసా..’’ అంటూ సాగే ఈ పాటతో పాటు ఓ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వారియర్ లుక్‌లో గన్, కత్తి పట్టుకుని రష్మిక పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తుంది.
బర్త్‌డే రోజు అదిరిపోయే ట్రీట్ అనేలా ఈ పోస్టర్ ఉంది. ఇక చక్కని మెలోడీ గీతంగా వచ్చిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఎంతో బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేశారు. రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించగా.. విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో వచ్చే పోయెమ్‌ను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రాయడం విశేషం. మంచి లవ్ ఫీల్‌తో వచ్చిన ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- Mahesh Babu: మహేష్ చేతిలో పాస్‌పోర్ట్.. అప్పుడే జక్కన్న వదిలేశాడా? మీమ్స్ చూశారా!
రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమాను త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నామని మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు