Jangaon District: వల్మీడి శ్రీరామాలయంలో నకిలీ బుక్కుల ముద్రణ, వసూళ్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయ ఈవో, దేవస్థానం అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి భారీగా వసూళ్లు జరిగినట్టు గుర్తించారు. ఈ విషయం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి చేరడంతో తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.కృష్నప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో, వసూళ్ల దందాకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ అవకతవకలు గత పది రోజుల క్రితమే బయటపడ్డా, ఆలయ అధికారులు చూసి చూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.గ్రామస్థులు ఆలయ అధికారుల అనుమతితోనే ఈ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు.
Also read: Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ మరో వీడియో లీక్.. ఈ సారి మరి బాబోయ్..