Minister Srinivas Reddy: సబ్ స్టేషన్ నిర్మాణంతో నిరంతర విద్యుత్ సరఫరా బలోపేతం అవుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి నేలకొండపల్లి మండలం అనంతనగర్ లో 2 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్ర పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు, గృహ అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు నాణ్యమైన విద్యుత్ తో పాటు, ఎటువంటి కరెంట్ కోతలు లేకుండా ఉండేందుకు సబ్ స్టేషన్ లను మంజూరు చేసినట్లు తెలిపారు.
Also read: Hyd Local Body Elections: హైదరాబాద్ లో ఎన్నికల హీట్.. సై అంటోన్న బీజేపీ-ఎంఐఎం.. గెలుపు ఆ పార్టీదేనా?
రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రారంభించుకుంటామన్నారు. రాష్ట్రం అప్పులలో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, పేదల కన్నీళ్ళు తుడిచేందుకు పని చేస్తున్నామన్నారు. యాసంగిలో పండించిన సన్న వడ్లకు కూడా వానాకాలం లాగా క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని మంత్రి తెలిపారు.