Sri Rama Navami(image credit: swetcha)
తెలంగాణ

Sri Rama Navami: భద్రాద్రి సీతమ్మకు బంగారు పట్టుచీర.. చీర స్పెషాలిటీ తెలుసా?

Sri Rama Navami: సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బంగారు పట్టు చీరను నేశాడు. చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూల విరాట్ దేవతా మూర్తులను వచ్చే విధంగా, చీర కింది బార్డర్ లో శంఖు, చక్ర నామాలు హనుమంతుడు , గరుత్మంతుడు వచ్చే విధంగా పొందుపరిచాడు.

అంతే కాకుండా చీర మొత్తం శ్రీరామ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 ఒక్కసార్లు వచ్చే విధంగా నేయడం విశేషం. చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం ఉపయోగించి, ఎనిమిది వందల గ్రాముల బరువు గల ఏడు గజాల బంగారు చీర నేశాడు.

ఇప్పటికే ఇలాంటి అరుదైన చీరలు నేస్తూ హరిప్రసాద్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చీరను నేయడానికి సుమారు పది రోజుల పాటు శ్రమించి నట్లు హరిప్రసాద్ తెలిపాడు. ఇలాంటి అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి, దేవాదాయ శాఖకు అందించి, చేనేత కలను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నాడు.

Also read: OTT Movie: బిడ్డ కోసం దెయ్యాలతో యుద్ధం చేసిన ఓ తల్లి కథ .. త్వరలో ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే?

అలాగే ప్రతి ఏడాది భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల నేతన్నలకు పట్టు వస్త్రాలు నేసే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. గత మూడేళ్లుగా సీతారాముల కళ్యాణానికి ప్రత్యేకమైన చీరలు నేస్తున్న హరి ప్రసాద్ ను పలువురు అభినందిస్తున్నారు.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!