Nagarkurnool crime: తెల్లవారుజామున ఊరుకొండ పేట ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో వివాహితపై జరిగిన అత్యాచారం కేసులో నిందితులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ మీడియాకు తెలిపారు. కల్వకుర్తి డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అత్యాచారా నిందితులను ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు.
జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఊరుకొండ పేట శ్రీ ఆంజనేయ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులపై అత్యాచార ఘటనలో పాల్గొన్న బృంద సభ్యులు నిఘా ఉంచేవారని ఈ బృందంలో ఒక వ్యక్తి దేవాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడని సమాచారం.
శనివారం బాగా పొద్దు పోయాక సహచరుడితో బాటుగా బహిర్భూమికి వెళ్లిన మహిళను మద్యం మత్తులో ఉన్న గ్రామానికి చెందిన నలుగురు యువకులు మహిళా సహచరుడీ కాళ్లు చేతులు కట్టువేసి నోట్లో గుడ్డలు కుక్కి సదరు మహిళను జన సందోహానికి దూరంగా ఈడ్చుకు వెళ్లి అత్యాచారం చేశారు.
Also Read: Gold Rate Today : మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు
ఆ నలుగురు యువకులు మరో ముగ్గురికి సమాచారం ఇవ్వడంతో ఏడు మంది యువకులు రాత్రంతా ఆ వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడి సమయంలో దాహం వేస్తుంది నీళ్లు ఉండని అడిగినా బాధిత మహిళ నోట్లో మూత్రం విసర్జించి తమ పైశాచికానందాన్ని పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిపారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు కఠిన శిక్ష విధించాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు