TG 10th Exams Result: తెలంగాణలో పదో తరగతి ప్రధాన పరీక్షలు ముగిశాయి. మార్చి 21న ఈ పరీక్షలు ప్రారంభమవ్వగా బుధవారంతో ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. కాగా ఓపెన్ ఎస్సెస్సీ విద్యార్థులకు మరో రెండు పరీక్షలు మాత్రం మిగిలున్నాయి. అవి కూడా ఈనెల 4తో ముగియనున్నాయి. తెలంగాణలో మొత్తం 2,650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కాగా త్వరలో జవాబు పత్రాల మూల్యంకనం ప్రారంభమవ్వనుంది.
మే నెలలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బుధవారం సోషల్ స్టడీస్ పరీక్షకు మొత్తం 4,97,712 మంది దరఖాస్తు చేసుకోగా 4,96,470 మంది పరీక్షకు హాజరయ్యారు. 1242 మంది గైర్హాజరయ్యారు.
ఈనెల 4న టెన్త్ స్టూడెంట్స్ కు కెరీర్ గైడెన్స్ ప్రొగ్రాం
పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై టీశాట్ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 గంటల వరకు ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్రక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా డైరెక్టర్ నర్సింహారెడ్డి, కోర్సుల వివరాలు తెలిపే నిపుణులు పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులు తాము చేరాలనుకునే కోర్సులు, కాలేజీ ఫీజులు, స్కాలర్షిప్ వంటి అంశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవచ్చని సూచించారు.
Also read: TGSCSC Students: గ్రూప్ – 1 ఫలితాల్లో తెలంగాణ సత్తా.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి