Telangana Image Source Twitter
తెలంగాణ

Telangana: నాడు డైవర్షన్.. నేడు పొలిటికల్ వర్షన్.. బీఆర్ఎస్ పై కేంద్రం ఫైర్..

Telangana: కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిపై వివాదం నెలకొన్న సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవైపు విద్యార్థులు, మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఇంకోవైపు రాజకీయ పార్టీలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గడచిన పదేండ్లలో రాష్ట్రంలోని అటవీ ప్రాంతం ఏ మేరకు విధ్వంసమైందో లోక్‌సభ వేదికగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా (అన్ని రాష్ట్రాల్లో కలిపి) మొత్తం 1.73 లక్షల చ.కి.మీ. మేర అటవీ భూములను అభివృద్ధి అవసరాల కోసం డైవర్ట్ చేయడానికి అనుమతులు మంజూరయ్యాయని, ఇందులో తెలంగాణ 11,422 చ.కి.మీ.తో థర్డ్ ప్లేస్‌లో ఉన్నట్లు తెలిపింది. ఫస్ట్ ప్లేస్‌లో మధ్యప్రదేశ్‌లో 38,552 చ.క.మీ. మేర ఉంటే ఆ తర్వాత ఒడిశాలో 24,458 చ.కి.మీ. చొప్పున ఉన్నట్లు కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ గత నెల 24న వివరించారు.

Also Read:  Anchor Pradeep: ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రదీప్

రాష్ట్రం ఏర్పడే నాటికి వెరీ డెన్స్ ఫారెస్ట్ (దట్టమైన అడవి), మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ (ఒక మోస్తరు అడవి), ఓపెన్ ఫారెస్ట్ కలిపి మొత్తం 21,591 చ.కి.మీ. మేర ఉంటే 2023 నాటికి అది 21,179 చ.కి.మీ. మేర తగ్గింది. తొమ్మిదేండ్ల కాలంలో రాష్ట్రం మొత్తం మీద సుమారు 412 చ.కి.మీ. మేర అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు వివిధ రకాల అభివృద్ధి పనులకు అటవీ భూములను వినియోగించడంతో విస్తీర్ణం తగ్గింది. ఇండియన్ స్టేట్స్ ఫారెస్ట్ రిపోర్టు – 2023 నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం రెండేండ్లలోనే 100 చ.కి.మీ. మేర తగ్గినట్లు పేర్కొన్నది. ట్రీ కవర్, ఫారెస్టు కవర్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది 105 చ.కి.మీ. మేర తగ్గినట్లు తేలింది. 2021 నాటికి అటవీ ప్రాంతం 21,279 చ.కి.మీ. ఉన్నట్లు ఆ రిపోర్టులో నమోదైంది. ఫారెస్ట్ కవర్ గణనీయంగా తగ్గిన రాష్ట్రాల్లో త్రిపుర తర్వాతి స్థానం తెలంగాణదే.

Also Read:  MLC Balmuri venkat: మైమ్ హో మ్ పై బీజేపీ, బీఆర్ఎస్ ప్రేమ ఎందుకు..?కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రశ్న?

మూడేండ్లలో 12 లక్షల చెట్ల నరికివేత :

రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేండ్ల కాలంలో (2016-19 మధ్యలో) మొతం 12.12 లక్షల చెట్లను నరికివేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. అభివృద్ధి ప్రాజెక్టుల అవసరాలకు అటవీ భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో పర్మిషన్లు మంజూరయ్యాయి. ఆ ప్రకారం 2016-17లో 32,407 చెట్ల నరికివేతకు అనుమతులు రాగా ఆ తర్వాతి సంవత్సరం (2017-18లో) 6,58,104 చెట్లను తొలగించేందుకు అనుమతులు వచ్చాయి. మూడవ సంవత్సరం 5,22,242 చెట్లకు కూడా అనుమతులు వచ్చాయి. ఈ మూడేండ్లలో మొత్తం 12,12,753 చెట్లను నరికివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అటవీ డివిజన్ల వారీగా వివరాలను పంపి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి కోరింది. దేశంలో అత్యధిక చెట్ల నరికివేతలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది. ఆ తర్వాత 10.73 లక్షల చెట్ల తొలగింపులో మహారాష్ట్రది సెకండ్ ప్లేస్. ఆ ప్రకారం దేశం మొత్తం మీద చెట్ల నరికివేతకు లభించిన అనుమతుల్లో దాదాపు 16% తెలంగాణకు చెందినవే ఉన్నాయి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు