Palm Oil Crop: ఆయిల్ పామ్ రైతులకు తెలంగాణ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకప్పుడు కనీస ధర కూడా లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే, తాజాగా ఆయిల్ పామ్ గింజల ధర టన్నుకు రూ.21,000 గా ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధర పెరిగిందని అన్నారు. దీని వలన రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. అలాగే, పంటలను సాగు చేసే వారికి రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Also Read: BRS Leader Meet Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో బీఆర్ఎస్ ఎంపీలు భేటి.. ఎందుకంటే?
రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగును చేసేందుకు 10 కంపెనీలకు పర్మిషన్స్ ఇచ్చామని, ఇప్పటివరకు 40 లక్షల ఎకరాల్లో సాగు మొదలైందని తెలిపారు. అంతే కాకుండా 4,354 మంది రైతుల ఖాతాల్లో రూ.72 కోట్లు జమ చేశామని వెల్లడించారు. ఇలా ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామని మంత్రి తెలిపారు.
ఐదు నెలల క్రిత్రం, లీటర్ పామాయిల్ ప్యాకెట్ ధర రూ.110 గా ఉంది, ఇప్పుడు రూ.150-160కి గా పలుకుతోంది. అంటే, ఆ లెక్కన చూసుకుంటే 36 నుంచి 45 శాతం పెరిగింది. మరి, పంట పండించే రైతులకు అలాగే పెరగాలి కదా. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆయిల్ పామ్ గింజల ధర టన్ను రూ.14,174 నుంచి రూ.21,000 కి పెరిగింది. అంటే.. రైతులకు గిట్టుబాటు ధర మాత్రమే లభించింది.
గతంలో రైతులకు టన్నుకు రూ.13,000 వచ్చేవని, ఇప్పుడు ధర రూ.21,000 పలుకుతున్నా.. మాకు లాభాలు రావడం లేదని అంటున్నారు. ఎందుకంటే, పెట్టుబడికే సగం డబ్బును పెడుతున్నామని చెబుతున్నారు. ధరలు పెరిగినా రైతులు ఆశించినట్టుగా లాభాలు పరిమితంగానే ఉండొచ్చు. మొత్తానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నప్పటికీ రైతులకు మాత్రం ఈ పంట పండించడం ఒక సవాలుగా మారింది. రైతన్నలు వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు.