స్వేఛ్చ జోగిపేటః Sri Jagannatha Rathotsavam: తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద లోహ రథంగా పేరున్న జోగిపేటలోని శ్రీ జోగినాథ రథోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 2వ తేది నుంచి 12వ తేది వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. అందుకుగాను గత వారం రోజులుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ. పర్వదినం అనంతరం స్వామివారి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలకు ప్రత్యేకంగా సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఎలక్ట్రిషియన్స్‌తో జాతీయ రహదారిపై విద్యుత్ లైట్లు, ప్రభలు ఏర్పాటు చేశారు.
దేవాలయ చరిత్ర
వందల ఏళ్ల క్రితం ఒక జోగి గుట్టపై తపస్సు చేస్తుండగా, గుహాలో జోడు లింగాలు బయటపడడంతో దేవాలయంగా అభివృద్ది చేసారన్నది పెద్దలు చెబుతుంటారు. ఆందోలు గ్రామానికి చెందిన రైతుకు కళలోకి వచ్చి దేవాలయ నిర్మాణం చేపట్టాలని ఆ భగవంతుడు చెప్పడంతో దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నది చరిత్ర చెబుతుంది. జోగినాథుడి గుట్టపై వెలువడంతో శ్రీ జోగినాథ ఆలయంగా నామకరణంతో పాటు గ్రామానికి కూడా జోగిపేటగా పేరు పెట్టినట్లుగా ఆలయ పూజారులు చెబుతున్నారు. చాలా ఏళ్ల క్రితం నుండి ప్రతి ఉగాది పండగ అనంతరం ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
50 అడుగుల ఎత్తులో లోహ రథం
50 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీజోగినాథ రథం తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రథంగా గుర్తింపు ఉంది. 5 అంతస్తులుగా కల్గిఉన్న ఈ రథంలో దేవతా మూర్తులైన నందీశ్వరుడు, గణపతి, దుర్గమాత శివలింగం, జోగిపేట జోగినాధ స్వామి నిద్దరదివ్య సుందరిమణులు పంచలోహ విగ్రహలను ఎర్పాటు చేశారు. రథోత్సవం రోజున రంగు రంగుల విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించి రథాన్ని ముస్తాబుచేస్తారు. పట్టణంలోని గౌని చౌరస్తా నుంచి శ్రీ జోగినాథ ఆలయం వరకు ఊరేగింపును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానాకి చుట్టు ప్రక్క గ్రామాల నుంచి వేలాది మంది తరలివస్తారు.
లంకా దహనానికి ప్రత్యేకత
ఈనెల 11వ తేదిన ఉత్సవాల్లో భాగంగా లంకాదహనాన్ని నిర్వహిస్తారు. లంకాదహనానికి ప్రత్యేకత ఉంది. రాయల సీమ ప్రాంతానికి చెందిన వారితో బాణా సంచాలతో సుమారు 30 అడుగులకు పైగా రావణాసురుడి ఉత్సవ విగ్రహాన్ని తయారు చేయించి అందులో బాణా సంచాలు పెట్టి పేలుస్తారు. ఎన్టీఆర్ స్టేడియంలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది వస్తారు.
వైభవంగా జాతరను నిర్వహిస్తాం.
చాలా ఏళ్ల నుంచి శ్రీ జోగినాథుడి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తాం. ఎంతో చారిత్రాత్మక దేవాలయంగా పేరున్న జోగినాథ ఆలయ ఉత్సవాలకు భక్తులు ప్రతి ఏటా వందలాది మంది తరలివస్తుంటారు. వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు, పురప్రముఖుల సహకారంతో ప్రతిఏటా ఘనంగా నిర్వహించగలుగుతున్నాము. పది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేయాలి.
Also Read: RK Roja on Pawan Kalyan: శ్రీవారిని నిద్రపోనివ్వరా.. ఇదే మీ సనాతనమా.. పవన్ కు రోజా చురకలు