మేడ్చల్ స్వేచ్ఛ: Fine Rice distribution: సన్న బియ్యం పధకం చారిత్రాత్మక నిర్ణయమని మేడ్చల్ డిసిసి ప్రెసిడెంట్ సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని గ్రంథాలయం సమీపంలో ఉన్న రేషన్ షాప్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ క్రాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం పేదవాడికి కడుపునిండా మూడు పూటలా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దొడ్డు బియ్యం స్దానంలో సన్న బియ్యం పొందడంతో పలువురు లబ్ది దారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు మహేష్, దేవా, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
Also Read: Minister Sridhar Babu: సన్నబియ్యంతో అక్రమాలకు చెక్.. ఎలాగో వివరించిన మంత్రి శ్రీధర్ బాబు