aditya 369 sequel update twitter
ఎంటర్‌టైన్మెంట్

Aditya 369 Sequel Update: బాలయ్య ఫ్యాన్స్ ఎగిరిగంతేసే న్యూస్.. ఆదిత్య 369 సీక్వెల్ పై క్రేజీ ఆప్డేట్

Aditya 369 Sequel Update: ప్రస్తుతం, తెలుగు సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. దీని వలన అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు హిట్ అవుతున్నాయి. మధ్య కాలంలో అల్లు అర్జున్ , మహేష్ బాబు, రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ , పవన్ కల్యాణ్ మూవీస్ మళ్లీ విడుదలయ్యాయి. తాజాగా, మరో చిత్రం రీరిలీజ్ కు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ట సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ గా నిలిచిన ” ఆదిత్య 369 ” (Aditya 369)ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 18 జూలై 1991 లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. అంతేకాదు, ఈ చిత్రానికి నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

Also Read: Dangerous Tree: రోడ్డుపై కనిపించే ఈ మెుక్కలు ప్రాణాంతకం.. దగ్గరకి వెళ్లారో ప్రమాదంలో పడ్డట్లే!

వచ్చే నెలలో ” ఆదిత్య 369 ” ( Aditya 369 ) సినిమా రి రిలీజ్ అవ్వబోతోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌ నిర్వహించారు. గాడ్ ఆఫ్ మాసెస్ స్టార్ హీరో బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబీ పాల్గొన్నారు. వీరితో పాటు సినిమాలో కీలక పాత్రలో కనిపించిన బాబూ మోహన్, నిర్మాత హాజరయ్యారు. అందరూ ఈ సినిమాతో వారికి ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ” ఆదిత్య 369 ” చిత్రం రిలీజ్ అయిన సమయంలో బాబీ, అనిల్ తమ వయసు ఎంతో బయటపెట్టారు. సందర్భంగా వారు మూవీని మొదటిసారి ఎక్కడ చూశారో గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో తను, బాలకృష్ణ కలిసి ఎంత అల్లరి చేశామో బాబూ మోహన్ చెప్పారు.

Also Read: IPL 2025: ఉప్పల్ స్టేడియంలో టికెట్ల లొల్లి.. వెళ్లిపోతామన్న సన్ రైజర్స్ టీమ్.. హెచ్ సీఏ ఆన్సర్ ఇదే!

బాలయ్య మాట్లాడుతూ ” ఆదిత్య 369  సినిమాను ఎంత కష్టపడి తెరకెక్కించారో తెలిపారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలు తీస్తున్న సమయంలోనే ఈ మూవీ ఆఫర్ వచ్చిందని, కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతోనే చేశానని చెప్పారు. సీక్వెల్‌కు ( Aditya 369 Sequel )ప్లానింగ్ అంతా ముగిసిందని, కేవలం ఒకే ఒక్క రోజులో కథను పూర్తి చేశామని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని ” ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు