Rakul Preet Singh(image credit:X)
ఎంటర్‌టైన్మెంట్

Rakul Preet Singh: బ్రేకప్ ఎంతో భయంకరం.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్వేచ్ఛ, సినిమా:Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ బ్రేకప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. “నమ్మి విడిపోతే ఆ బాధ ఎంతో భయంకరం” అంటూ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “జీవితంలో అందరికీ ప్రేమ, బ్రేకప్ అనేవి ఉంటాయి. ఇవి నా జీవితంలో కూడా ఉన్నాయి. నేను ఈ బ్రేకప్ వల్ల ఎన్నో నేర్చుకున్నాను. కానీ, ఎవరినైనా మనం బాగా నమ్మి ఆ తర్వాత ఆ వ్యక్తి నుండి విడిపోతే ఆ బాధ అంత భయంకరమైనది ఇంకొకటి ఉండదు. దాన్ని వర్ణించడానికి మాటలు కూడా ఉండవు. ముఖ్యంగా ఒకరిని గుడ్డిగా నమ్మి మోసపోయామే అనే గిల్ట్ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది.

Also read: Vijay Varma: తమన్నతో బ్రేకప్.. విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్.. అదేంటి అలా అనేశారు!

ప్రేమ అనేది చాలా గొప్పది. అలాగే మన లైఫ్‌లో మనకి ఉన్న లోటు వేరే వాళ్ళు తీరుస్తారని ఎప్పుడూ కూడా నమ్మకం పెట్టుకోకూడదు. మన లైఫ్‌లో ఉన్న లోటుని మనమే తీర్చుకోవాలి తప్ప వేరే వారిపై ఆశపడకూడదు’’ అని తెలిపింది. ఫస్ట్ టైం తాను జాకీ భగ్నానిని కలిసిన సమయంలో ఇదే విషయాన్ని చెప్పానని, తమ ప్రేమ మొదలైనప్పటి నుండి ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చానని తెలిపింది. ఎవరి ఆలోచనలు, అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పానని, తన ఆలోచన, అభిప్రాయాలు రెండూ నచ్చే జాకీ కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నాడని వివరించింది. అలా తామిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని గుర్తు చేసుకుంది. ప్రస్తుతం రకుల్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!