Chiranjeevi: ‘మంగపతి’ పాత్రకి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రశంసలు వచ్చేశాయ్. నటుడు శివాజీ (Sivaji) తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి మంచి పాత్రలు చేస్తూ, ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బిగ్ బాస్ తెలుగు షో లో శివాజీని చూసిన వారంతా ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ‘90స్’ వెబ్ సిరీస్‌లో శివాజీ నటన ఆయనని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. పాత్ర ఏదైనా, పరకాయ ప్రవేశం చేయడంలో నాకు నేనే సాటి అనేలా, శివాజీ తనలోని నటనను బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో ఆయనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేసిన చిత్రంగా ‘కోర్టు’ సినిమా ప్రశంసలను అందుకుంటోంది.
Also Read- Vijay Varma: తమన్నతో బ్రేకప్.. విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్.. అదేంటి అలా అనేశారు!
నేచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో సమర్పించిన చిత్రం ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమాకు దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మొదటి రోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని థియేటర్లలో దూసుకెళుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన యంగ్ కపుల్ రోషన్, శ్రీదేవి పాత్రలతో పాటు ‘మంగపతి’ పాత్రలో నటించిన శివాజీ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.
సినిమా చూసిన వారంతా శివాజీ నటనను ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి, స్వయంగా శివాజీని ఇంటికి పిలిపించుకుని అభినందించడం విశేషం. శివాజీ కెరీర్‌లో చిరంజీవి ప్రాముఖ్యత ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘మాస్టర్’ సినిమా టైమ్‌లో చిరంజీవి చేసిన హెల్ప్ గురించి శివాజీ పదే పదే చెబుతూనే ఉంటారు. ఆ తర్వాత ‘ఇంద్ర’ సినిమాలోనూ శివాజీకి చాలా కీలక పాత్రని చిరంజీవి సజెస్ట్ చేశారు. అలా వారి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో శివాజీ ఎంచుకుంటున్న పాత్రలు, నటన.. ఆయనను మెగాస్టార్ పిలిపించుకునే వరకు తీసుకెళ్లాయి.
Also Read- Kannappa Postponed: కన్నప్ప సినిమాపై షాకింగ్ అప్ డేట్.. కీలక ప్రకటన చేసిన మంచు విష్ణు
‘కోర్టు’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శివాజీ కేవలం నటించలేదు, ఆ పాత్రలో జీవించేశారు. తన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి జోలికి వచ్చాడనే కారణంతో చందు అనే కుర్రాడిని ఇబ్బంది పెట్టే పాత్రలో శివాజీ చూపించిన తీవ్రత, ఫెరోషియస్ నటన అందరి మనసులనూ ఆకర్షించింది. ఈ పాత్రతో శివాజీ తన నటనా ప్రతిభను మరోసారి వెండితెరపై ప్రదర్శించారు. ‘మంగపతి’ పాత్రకు శివాజీ ప్రాణం పోసిన తీరు, ఆయన చూపుల్లోని కోపం, మాటల్లోని ఆధిపత్యం, చేష్టల్లోని దౌర్జన్యం.. అన్నీ కలిసి ఆ పాత్రని తెరపై ఒక శక్తివంతమైన పాత్రగా నిలబెట్టాయి. నిజంగా ఇది శివాజీ నటనా సామర్థ్యానికి నిదర్శనం. అందుకే శివాజీకి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్న మెగాస్టార్ చిరంజీవి, మంగపతి పాత్రలో శివాజీ నటనను మెచ్చుకుంటూ, అభినందనల వర్షం కురిపించారు. ‘నీవు ఈ పాత్రలో నటించలేదు, జీవించావు. ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలి’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ మీట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు