TG Govt (imagecredit:twitter)
తెలంగాణ

TG Govt: హరిత హోటల్స్ లీజుకు.. ఆసక్తి ఉందా? ఇలా చేయండి.

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: TG Govt: రాష్ట్ర ప్రభుత్వం హరిత హోటల్స్ ను లీజుకు ఇవ్వబోతుంది. వాటి నిర్వహణ ఖర్చు పెరుగుతుండటం, వాటి ఆదుకీరణకు సైతం కోట్ల రూపాయలు అవుతుండటంతో వాటిని తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది. అందులో బాగంగానే రాష్ట్రంలోని 21 హోటల్స్ ను లీజు ఇవ్వాలని నిర్ణయించింది. టెండర్ కు సైతం ఆహ్వానిస్తుంది. అధికారులు మాత్రం ప్రభుత్వానికి ఆదాయం రాబట్టడంలో భాగంగానే లీజుకు ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత హోటళ్లు నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలతో పాటు జాతీయ రహదారులపై ఈ హోటల్లు పర్యాటకులకు సేవలు అందిస్తున్నాయి. తాజాగా వీటి నిర్వహణలో ప్రైవేటు వ్యక్తులను భాగస్వామ్యం చేయడానికి పర్యాటక శాఖ భావిస్తూ రాష్ట్రంలోని 21 హరిత హోటళ్లు, రెస్టారెంట్లను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ హోటళ్ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కోసం ఆసక్తిగలవారు ఏప్రిల్ 16 మధ్యాహ్నంలోగా తమ అభ్యర్థనను (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) పంపించాలని అధికారులు తెలిపారు. ఇందుకోసం వేర్వేరుగా నోటిఫికేషన్లు సైతం జారీ చేసింది.

ఏ రెస్టారెంట్ కు ఎంత లీజు అని ధరను సైతం నిర్ణయించింది. ఏడాదికి ఎంత కేటాయించాలనేది నిబంధనలతో కూడిన లీజును నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో హోటల్ కు వేర్వేరుగా టెండర్లు ఆహ్వానిస్తే ఆశించిన స్పందన రావడం లేదని, అన్నింటికీ కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని 21 హోటళ్లలో నాగార్జున సాగర్ లోని విజయవిహార్ కు ఏడాది రూ.15, 08,842 గా ధర నిర్ణయించారు. నిజామాబాద్ లోని హరిత హోటల్ కు 9,23,988, ములుగు జిల్లాలోని లక్నవరం హరిత రెస్టారెంట్ కు రూ.11,31,921, సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ లోని హోటల్ కు రూ.10,86,400, వికారాబాద్ జిల్లా అనంతగిరి హోటల్ కు రూ.6,61,500, ములుగు జిల్లా రామప్ప హరిత రెస్టారెంట్ కు రూ.2,40,000 మరియు

Also Read: MP Chamala Kiran Kumar: పార్లమెంటులో గొంతు నొక్కేస్తున్నారు’.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్

జిగిత్యాల జిల్లా కొండగట్టు హరిత రెస్టారెంట్ కు రూ.2.40లక్షలు, మంచిర్యాల జిల్లా జగన్నాథురం హరిత హోటల్ కు రూ.1.20లక్షలు, నాగర్ కర్నూల్ జిల్లా శ్రీరంగపురంహోటల్ కు రూ.1.28లక్షలు, మహబూబ్ నగర్ జిల్లా కోయల్ కొండ హోటల్ కు రూ.1.28లక్షలు, ఆలంపూర్ లో రెస్టారెంట్ కు రూ. 2,07,018, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ హోటల్ కు రూ.1.60 లక్షలు, ఖమ్మం జిల్లా వైరాలోని హోటల్ కు రూ.1.92లక్షలు, వనపర్తి జిల్లా చీచుపల్లి హోటల్ కు రూ. 89.184, సంగారెడ్డి జిల్లా ఝరాసంఘ్ కాటేజీకి రూ.40,824, సంగారెడ్డి జిల్లా నందికంది హోటల్ కు రూ65,496, ములుగు జిల్లా ఘన్ పూర్ హరిత హోటల్ కు రూ.87,492, జెట్ ప్రోలు హరిత హోటల్ కు రూ.87,516 ధర నిర్ణయించారు. ఈ ధరలను ఏడాదికి వసూలు చేయనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

మహతి ఆడిటోరియంకు 9లక్షలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్. ఆ నియోజకవర్గంలో మహతి ఆడిటోరియం ఉంది. ఈ ఆడిటోరియంను సైతం లీజుకు ఇచ్చేందుకు పర్యాటక శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఏడాదికి ఈ ఆడిటోరియంకు రూ.9లక్షలు అని పేర్కొంది. కేసీఆర్ నియోజకవర్గం కావడంతో ఈ మహతి ఆడిటోరియం టెండర్ చర్చనీయాంశమైంది. అదే విధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాద్రిలో 17 షాపులను లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ షాపులకు ఏటా 20,40,000గా ధర నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లా సింగూరు పార్కును సైతం లీజుకు ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానించింది. ఏటా రూ.60లక్షలుగా పేర్కొంటూ నోటిఫికేషన్ ఇచ్చింది.

ప్రభుత్వం నిర్వహించలేక ప్రైవేటు వైపు

రాష్ట్రంలోని హరిత హోటల్లు, రెస్టారెంట్లు నిర్మించి చాలా ఏళ్లు అవుతుంది. కొన్ని మాత్రం నిర్మించి పాతికేళ్లు దాటింది. దీంతో నిర్వహణ వ్యయం ప్రతి ఏటా కోట్ల రూపాయల ఖర్చుఅవుతుంది. మరోవైపు ఆదుకీరణకు రూ.50కోట్లకు పైగా అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో హోటల్లు ప్రైవేటుకు లీజు కు ఇస్తే ప్రభుత్వానికి నిర్వహణ వ్యయభారం తగ్గడంతో పాటు ఆదాయం వస్తుందని భావిస్తుంది. అందులో భాగంగానే టెండర్లకు ఆహ్వానించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పదేళ్లలో 100కోట్లపైగా బకాయిలు? 

గత పదేండ్లలో తెలంగాణ స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీఎస్‌టీడీసీఎల్‌) నిర్వీర్యమైంది. ఆర్థిక ప్రణాళిక లేకుండా కమీషన్ల కోసం ఇష్టారీతిన ఏర్పాటు చేసిన హరిత హౌటళ్లు పీకల్లోతు నష్టాల్లో కూరుకు పోయాయనే ఆరోపణలు వస్తున్నాయి. లీజులు, సబ్‌లీజుల కేటాయిం పుల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఫలితంగా రూ.100 కోట్లకు పైగా బకాయిలు పేరుకు పోయినట్లు సమాచారం. వాటిని వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలుఉన్నాయి. లీజు దార్లకు వకాల్తా పుచ్చుకున్న అధికారులు నోటీసులతోనే సరిపెట్టారనే విమర్శలువెల్లువెత్తుతున్నాయి. నోటీసులందు కున్న లీజుదారులు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి ఏండ్లుగా నెట్టు కొస్తున్న ఘటనలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం టూరిజంను గడిలో పెట్టాలని పలువురు కోరుతున్నారు.

గత ప్రభుత్వంలో 30హోటళ్లు మూత 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 30 హరిత హోటల్లు మూతపడ్డాయని ప్రభుత్వం పేర్కొంటుంది. ఇదే విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం మీడియా ముందు ఆరోపించారు. ఆ హోటళ్లను తిరిగి పునరుద్దరించేందుకు పీపీపీ మోడల్ పనిచేయాలని భావిస్తుంది. అందుకోసం ప్రైవేటు కంపెనీలను ఆహ్వానిస్తుంది. మరోవైపు రాష్ట్రానికి పర్యటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. పండుగలను, పర్యాటక దినోత్సవాలను పురస్కరించుకొని పర్యాటకులకు రాయితీలను సైతం ప్రకటిస్తుంది. మరోవైపు హరిత హోటళ్లు, పర్యాటక రంగంపై విస్తృత ప్రచారానికి డాక్యుమెంటరీలను సైతం రూపొందిస్తుంది.

Also Read: Telangana Govt : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగాల జాతరే..

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!