TG Govt on B-Tech: మీరు బిటెక్ ఫెయిలయ్యారా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే! | Swetchadaily | Telugu Online Daily NewsTG Govt on B-Tech: మీరు బిటెక్ ఫెయిలయ్యారా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే!
Bank Holidays April 2025
Telangana News

TG Govt on B-Tech: మీరు బిటెక్ ఫెయిలయ్యారా? ఈ గుడ్ న్యూస్ మీకోసమే!

TG Govt on B-Tech: బీటెక్ చదివే చాలా మంది విద్యార్థులకు బ్యాక్ లాగ్స్ చాలా పెద్ద సమస్యగా పరిణమిస్తుంటాయి. నాలుగేళ్ల పాటు బీటెక్ చదివిన ఏ విద్యార్థి అయినా ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అతడికి సర్టిఫికేట్ లభించదు. ఇది గమనించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ (Telangana Govt).. విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సగం సబ్జెక్టులు పాసైనా సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది.

కమిటీ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ చేసిన విద్యార్థులు సగం క్రెడిట్స్ సాధించినా అంటే సగం సబ్జెక్టులు పాసైన సర్టిఫికేట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విధివిధానాలను ఖరారు చేసేందుకు ఓ కమిటీ సైతం ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే బీటెక్ విద్యార్థులకు భారీ ఊరట లభించినట్లేనని విద్యావేత్తలు భావిస్తున్నారు.

Als0 Read: Bank Holidays April 2025: అలర్ట్.. అలర్ట్.. ఏప్రిల్ లో సగం రోజులు.. బ్యాంక్ సెలవులే..

క్రెడిట్స్ అంటే ఏంటి?
బీటెక్ లో 160 క్రెడిట్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్ కు 20 క్రెడిట్లు కేటాయిస్తారు. ఒక్కో సెమీస్టర్ కు ఐదారు సబ్జెక్టులు ఉండగా వాటన్నింటిలో పాసైతే 160 క్రెడిట్లు ఇస్తారు. అప్పుడే మాత్రమే వారికి బీటెక్ పట్టా లభించనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం సూచించిన విధానం ప్రకారం 160 క్రెడిట్లలో సగం అంటే 80 క్రెడిట్లు సాధించినా సర్టిఫికేట్ లభించనుంది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..