CM Revanth Reddy (imagecredit:twitter)
తెలంగాణ

CM Revanth Reddy: నేపాల్ రాజు కథ చెప్పిన సీఎం రేవంత్.. అందులో అంత అర్థం ఉందా?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: CM Revanth Reddy: గత ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందితే ఇప్పుడు సంక్షోభంలో పడ్డారని కేటీఆర్ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్ ఘాటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్‌లోని అంతర్గత వ్యవహారాలను రాష్ట్ర ప్రజలపై రుద్ది ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమాలను బంద్ పెట్టుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు.

నేపాల్ యువరాజు దీపేంద్ర తన అధికారాన్ని కాపాడుకునేందుకు కుటుంబం మొత్తాన్ని ఏకే-47 తుపాకితో కాల్చి చంపాడట ప్రసార మాధ్యమాల్లో దీన్ని విన్నాం ఇప్పుడు పెద్దాయన (పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ)ను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలని చూడొద్దు.. అని కేటీఆర్, హరీశ్‌రావులను పేరు వెల్లడించకుండా సీఎం రేవంత్ కామెంట్ చేశారు. ఆ ఇద్దరూ వారి తెలివితేటల్ని తెలంగాణ కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాలని సూచించారు.

నా ఇంగ్లీష్‌ పరిజ్ఞానంపైనా దుష్ప్రచారం :  

రాష్ట్రం కోసం దావోస్ వెళ్ళి వివిధ దేశాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతూ ఉంటే, కేటీఆర్ సహా కొందరు బీఆర్ఎస్ నేతలు తనకున్న ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానంపై సెటైర్లు వేస్తున్నారని, కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఉదహరించారు. చైనా, జపాన్, జర్మనీ దేశాల్లోని చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇంగ్లిష్‌లో మాట్లాడరని, వారి దేశ భాషల్లోనే మాట్లాడుతారని, అయినా ఆ దేశాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థనే శాసిస్తున్నాయని గుర్తుచేశారు. కొందరిలాగా (కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ) తాను గుంటూరులో చదువుకోలేదని, ఆ తర్వాత పూణె వెల్లలేదని, అమెరికా వెళ్ళలేదన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నానని అన్నారు. సభలో సీఎం చైర్‌లో కూర్చుంటే వారికి ఎందుకు అంత కడుపు మంట అని ప్రశ్నించారు. వచ్చే ఐదేళ్లూ మేం ఇక్కడే ఉంటాం మీరు అక్కడే ఉంటారు  కనీసం అక్కడైనా ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి, ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ తర్వాత రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులు కూడా వారికి దొరకరు ఆ పార్టీ పని అయిపోయింది. అందుకే ప్రతిపక్షంలోనైనా ఉంటుందో లేదో అని సీఎం వ్యాఖ్యానించారు.

Also Read: Bhatti Vikramarka: తెలంగాణ అప్పులపై కాగ్ సంచలన రిపోర్ట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు