BRS Party (image credit:Twitter)
తెలంగాణ

BRS Party: గులాబీ దళంలో.. డిప్యూటీ లీడర్లు లేనట్లేనా?

BRS Party: అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నేటితో ముగుస్తుంది. శాసనసభ, మండలి ఈ రెండు ఉభయ సభల్లోనూ డిప్యూటీ లీడర్లు గులాబీ పార్టీకి లేనట్లే. నియమిస్తాని ప్రజాసమస్యలపై పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తారని పార్టీ అధినేత ప్రకటించినప్పటికీ ఆదిశగా చర్యలు తీసుకోలేదు. పేర్లను సైతం ఫైనల్ చేసినట్లు లీకులు సైతం ఇచ్చారు. ఇక ప్రభుత్వంపై పోరాటమేఅని స్పష్టం చేశారు. కానీ సెషల్ ముగుస్తున్న ప్రకటించకపోవడంపై పార్టీ నేతలు పెదవివిరుస్తున్నారు.

అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని.. అందుకు పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 11 న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించండంతో పాటు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై, సుమారు 20పైగా అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఉభయ సభల్లో ప్రతిభావంతంగా ప్రజాసమస్యల మీద పోరాడేందుకు.. సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. బడ్జెట్ పద్దులపై మాట్లాడేటప్పుడు వివరాలతో ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పిలుపు నిచ్చారు. ‘షాడో కేబినెట్‌’లా వ్యవహరించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు.

కానీ డిప్యూటీ లీడర్లను నియామకం చేపడుతున్నామని, ఫలానా వ్యక్తులకు బాధ్యతలను అప్పగిస్తున్నామని లీకులు ఇచ్చారు. ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలు సైతం పేర్కొన్నారు. కానీ సమావేశాలు నేటి(శనివారం)తో ముగుస్తున్నాయి. అయినప్పటికీ డిప్యూటీ లీడర్లను మాత్రం నియమించలేదు. ఎందుకు నియమించలేనేది పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది.

జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎఫెక్ట్?
శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశిస్తూ జగదీష్ రెడ్డి చేసిన కామెంట్లతో ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి ఆయనను సస్పండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ సస్పెన్షన్ తో గులాబీ పార్టీ డైలమాలో పడింది. సభలో దూకుడుగా వ్యవహరించాలని భావించినప్పటికీ ఒక్కసారిగా ఈ వేటు పార్టీపై పడింది. అసెంబ్లీలో ఎక్కువగా దూకుడు పెంచితే సస్పన్షన్ చేస్తే సభలో ప్రజాసమస్యలపై మాట్లాడే వారు ఉండరని భావించి కొంత వెనక్కి తగ్గినట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఎఫెక్ట్ డిప్యూటీ లీడర్ల ఎంపికపై సైతం పడినట్లు సమాచారం. ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తే వారి సరిగ్గా నిర్వర్తించకపోతే ఫెయిల్ అయ్యామనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుందని దీంతో డ్యామేజ్ అవుతుందని, అందుకే నియమించక పోవడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చి పెండింగ్ లో పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు డిప్యూటీ లీడర్ల బాధ్యతలను అప్పగిస్తే ఆ పదవి రాలేదనే కొంతమంది సీనియర్లు సైతం నిరాశ చెందే అవకాశం సైతం ఉంది. దీంతోనూ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలోనే ఎంపిక చేయలేదని విశ్వసనీయ సమాచారం.

ముగ్గురే కీలకంగా…
ఈ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ లీడర్లను ఎవరిని పార్టీ అధినేత నియమించలేదు. కానీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్, హరీష్ రావులు అసెంబ్లీలో, కవిత మండలిలో సభ్యులను ముందుండి నడిపిస్తున్నారు. సమస్యలు ఎత్తిచూపుతున్నారు. అయితే వీరికే డిప్యూటీ బాధ్యతలు అప్పగిస్తే అధికార పక్షానికి అస్త్రాన్ని ఇచ్చినవారం అవుతామని భావించి ప్రకటించలేదని పలువురు పేర్కొంటున్నారు.

అలా కాకుండా వీరిని ముందుకు నడిపిస్తేనే బాగుంటుందని కేసీఆర్ భావించి… వారికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సభలో అనుసరించాల్సిన వ్యూహాలను వివరిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రతి అంశాన్ని ఈ ముగ్గురే డీల్ చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఒక వేళ డిప్యూటీ లీడర్ బాధ్యతలను అసెంబ్లీలో హరీష్ రావు, మండలిలో కవితకు అప్పగిస్తే మళ్లీ కుటుంబ సభ్యులకే అప్పగించారనే ప్రచారం జరుగుతుందని, ఇప్పటికే కుటుంబ పార్టీగా ముద్రపడిందని అందుకే డిప్యూటీ బాధ్యతలను ఎవరికి అప్పగించకుండా పెండింగ్ లో పెట్టారని నేతలు అభిప్రాయపడుతున్నారు.

మండలిలో సత్యవతి స్థానంలో విప్ ఎవరికో?
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్ ఎన్నికయ్యారు. ఆమె పదవికాలం ఈ నెల 29తో ముగుస్తుంది. సత్యవతికి మండలిలో పార్టీ విప్ బాధ్యతలను పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 4న అప్పగించారు. అయితే ఆమె స్థానంలో ఎవరిని నియమిస్తారనేది పార్టీలో చర్చకు దారితీసింది. ఎమ్మెల్సీగా గిరిజన కమ్యూనిటీ ఆమె ఒక్కరే ఉన్నారు. మళ్లీ ఎమ్మెల్సీగా రెన్యూవల్ చేయకపోవడంతో కొంత ఆ కమ్యూనిటీ ప్రజలు సైతం నిరాశతో ఉన్నట్లు సమాచారం.

Also Read: Betting Case: బెట్టింగ్ కు ఆజ్యం పోసిందెవరు? ఆ నేత చిట్టా ఈడీకి చేరిందా?

అయితే ఇప్పుడు విప్ బాధ్యతలు ఎవరికి ఇస్తారు? ఏ కమ్యూనిటీకి ఇస్తారు? లేకుంటే సభలో బలంగా వాయిస్ వినిపించేవారికి ఇస్తారా? విధేయులకు పెద్దపీట వేస్తారా? అసలు అధినేత మధిలో ఎవరున్నారనేది పార్టీలో చర్చకు దారితీసింది. ఇలా ఉంటే బడ్జెట్ సమావేశాలు కంప్లీట్ అవుతున్నా డిప్యూటీ లీడర్ ను ఎంపిక చేయకపోవడంతో అధినేతపైనే పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ ఎంపిక నిర్ణయం తీసుకోలేకపోతే భవిష్యత్ ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారనేది హాట్ టాపిక్ అయింది.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ