Shocking News: సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజా (Manoj Bharathiraja) హఠాన్మరణ వార్త సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. మనోజ్ భారతీరాజా (48) గుండెపోటుతో మంగళవారం సాయంత్రం అకాలమరణపాలయ్యారు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. దర్శకుడు భారతీరాజా తనయుడిగా మనోజ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా ‘కిళిప్పీట్టు’ చిత్రానికి ఆయన ప్రశంసలు అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఆయన పలు చిత్రాలలో మంచి మంచి పాత్రలు చేశారు.
Also Read- Gaddam Shiva Prasad: హరితహారం కార్యక్రమంపై స్పీకర్ మాస్ ర్యాగింగ్.. దెబ్బకు బీఆర్ఎస్ సైలెంట్!
మనోజ్ భారతీరాజా మరణానికి కారణమిదే
మంగళవారం సాయంత్రం సడెన్‌గా గుండెపోటు రావడంతో, వెంటనే కుటుంబ సభ్యులు ఆయనని చెన్నై (Chennai)లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా తెలుస్తుంది. మనోజ్ భారతీ రాజా ‘తాజ్ మహల్, అల్లీ అర్జున, పల్లవన్, అన్నక్కోడి’ వంటి పలు తమిళ చిత్రాలలో కీలక పాత్రలలో నటించారు. దర్శకుడిగా మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా కోలీవుడ్‌లో ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సమయంలో సడెన్‌గా ఇలాంటి వార్త వినాల్సి రావడం నిజంగా బాధాకరం.
Also Read- Kannappa: ‘కన్నప్ప’లో రఘుబాబు పాత్ర పేరేంటో తెలుసా? భయంకరంగా ఫస్ట్ లుక్!
ఆ తండ్రి బాధ వర్ణనాతీతం!
ఈ వయసులో కొడుకుని కోల్పోవడం అంటే ఏ తండ్రికైనా సగం ప్రాణం పోయినట్టే. మనోజ్ తన తండ్రిని తీవ్ర దు:ఖంలో ముంచేశాడు. భారతీరాజా బాధ వర్ణనాతీతం. ఆయనని చూసిన వారంతా కంటతడి పెడుతున్నారంటే.. ఎంతగా కుమిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇలాంటి బాధ, కష్టం ఎవరికీ రాకూడదు. అందులోనూ ఇంత పెద్ద వయసులో పక్కన స్ట్రాంగ్‌గా నిలబడాల్సిన కొడుకు, సడెన్‌గా అసలు రేపటి నుంచి కనిపించడంటే, ఆ తండ్రి వేదనని ఆపతరమా? ఆ దేవుడు భారతీరాజాకు, ఇతర కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ.. మనోజ్ భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని కోలీవుడ్ (Kollywood) అంతా కోరుకుంటుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి
‘‘ప్రముఖ దర్శకులు భారతీరాజా గారి కుమారుడు మనోజ్ భారతీరాజా హఠాన్మరణం చెందారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మనోజ్ భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నటుడిగా రాణిస్తూనే దర్శకుడిగా తండ్రి బాటలోకి వెళ్లిన సమయంలో కన్ను మూయడం బాధాకరం. భారతీరాజా గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్ర వియోగానికి గురైన భారతీరాజాగారికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని దేవుణ్ణి కోరుకొంటున్నాను’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) మనోజ్ భారతీరాజాకు నివాళులు అర్పించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు